సాహో త‌ర్వాత ప్ర‌భాస్ సినిమా అది కాద‌ట‌!

సాహో త‌ర్వాత ప్ర‌భాస్ సినిమా అది కాద‌ట‌!

బాహుబలి త‌ర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న సాహో చిత్రంపై భారీ అంచ‌నాలున్న సంగ‌తి తెలిసిందే. సుజీత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ న‌టిస్తోంది. అయితే, సాహో పూర్త‌యిన వెంట‌నే ప్రభాస్ ప్ర‌ముఖ‌ త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ తెర‌కెక్కించ‌బోతోన్న ఓ చిత్రంలో న‌టించ‌బోతున్నాడ‌ని వార్తలు వ‌స్తున్నాయి. అయితే, అవ‌న్నీ పుకార్లేన‌ని కోలీవుడ్ వ‌ర్గాల విశ్వ‌స‌నీయ స‌మాచారం. అస‌లు అట్లీ త‌న త‌దుప‌రి ప్రాజెక్టు కోసం ఏ హీరోను క‌ల‌వ‌లేద‌ని వార్తలు వ‌స్తున్నాయి. అస‌లు అట్లీ త‌న త‌ర్వాతి సినిమాను ఇప్ప‌ట్లో మొద‌లుపెట్టే అవ‌కాశం లేద‌ని కోలీవుడ్ టాక్ .

విజ‌య్ హీరోగా న‌టించిన ‘మెర్సల్‌’తో  అట్లీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ.200 కోట్లు కొల్ల‌గొట్టిన ఈ సినిమా స‌క్సెస్ ను అట్లీ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, తన కొత్త సినిమాను అట్లీ ప్ర‌భాస్ తో చేయ‌బోతున్నార‌ని వార్తలు వ‌చ్చాయి. కానీ, వాస్త‌వానికి అట్లీ త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్  స్ర్కిప్ట్ ను సిద్ధం చేసుకునే ప‌నిలో ఉన్నార‌ట‌. ఆ కథ ఇంకా పూర్తిగా సిద్ధం కావాల్సి ఉందని, కాబ‌ట్టి ప్ర‌భాస్ ను క‌ల‌వ‌లేద‌ని  కోలీవుడ్ టాక్. ఆ ప్రాజెక్టు ప్రీ-ప్రొడక్షన్‌ పనులు పూర్తి కావడానికే కొన్ని నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. ఆ త‌ర్వాతే హీరో, హీరోయిన్, ఇత‌ర నటీనటులను అట్లీ ఎంపిక చేసుకుంటార‌ట‌. మ‌రి ఈ పుకార్ల‌లో ఏది నిజ‌మో తెలియాలంటే మ‌రి కొన్ని నెల‌లు ఆగాల్సిందే.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English