రేసు నుంచి తప్పుకున్న గుర్రం?!

రేసు నుంచి తప్పుకున్న గుర్రం?!

సంక్రాంతి పండగకి సినిమా వస్తుందంటే ఆ సందడే వేరు. ప్రారంభపు వసూళ్లతో థియేటర్లు  కళకళలాడిపోతాయి. ఓ మాదిరి సినిమా కూడా సూపర్ హిట్టయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రతీ కథానాయకుడు తమ సినిమాని ముగ్గుల పండక్కి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈసారి కూడా స్టార్ కథానాయకులు మహేష్, అల్లు అర్జున్ సంక్రాంతి బరిలో నిలుస్తున్నట్టు ముందు నుంచీ ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా అల్లు అర్జున్ పండగ రేసు నుంచి తప్పుకున్నట్టు సమాచారం.

`రేసుగుర్రం` ఇప్పుడు ఇంకా చిత్రీకరణలో ఉంది. చాలా సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట. దీంతో సినిమాని పండగ తరవాతే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం తాజాగా నిర్ణయించుకుందట. పైగా మహేష్ సినిమాకి పోటీగా విడుదల చేయడం అంత మంచిది కాదని దర్శకుడు భావిస్తున్నాడట. థియేటర్ల కొరత సమస్య ఎదురయ్యే  అవకాశాలు కూడా కనిపించడంతో సినిమాని వాయిదా వేసుకోవడమే నయం అనుకుంటున్నారట.  అల్లు అర్జున్ బరిలోకి దిగడం లేదు కాబట్టి.. ఆస్థానంలో చరణ్ `ఎవడు` విడుదలయ్యే  అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం సాగుతోంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English