వాళ్లను తలుచుకుని అల్లరోడు ఏడ్చేశాడు

వాళ్లను తలుచుకుని అల్లరోడు ఏడ్చేశాడు

సినిమా రంగం అనేది బయటి నుంచి చూడ్డానికి చాలా అందంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ అందులోకి అడుగుపెడితే కానీ.. అసలు కష్టాలేంటో తెలియవు. సినిమాల్లో వెలిగిపోదామని ఎంతోమంది ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చి.. అవకాశాల్లేక అల్లాడిపోవడం గురించి బయటి ప్రపంచానికి తెలియదు. ఇలాంటి అభాగ్యుల గురించి అల్లరి నరేష్ ఒక కార్యక్రమంలో చాలా ఎమోషనల్ అయిపోతూ ఏడ్చేశాడు. ‘మనం సైతం’ పేరుతో ఓ సంస్థ ఇండస్ట్రీనే నమ్ముకుని అతి కష్టం మీద బతుకులీడుస్తున్ ఆర్టిస్టులను ఆదుకునేందుు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అల్లరి నరేష్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడ నరేష్.

తాను యాక్టింగ్ నేర్చుకునేటపుడు తమ బ్యాచ్‌లో 106 మంది ఉండేవాళ్లని.. ఐతే అందులో ఐదారుగురు మాత్రమే ఆర్టిస్టులయ్యారని.. మిగతా వాళ్లు ఏమయ్యారో.. ఎక్కడెక్కడ ఏ స్థితిలో ఉన్నారో తెలియదని నరేష్ చెప్పాడు. ఆ మధ్య తన యాక్టింగ్ క్లాస్ మేట్ ఒకరు కలిశారని.. అతను చాలా ఏళ్ల పాటు ఎంత ప్రయత్నించినా అవకాశాలు దొరకలేదని చెప్పాడని.. అలాగని తిరిగి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి లేకపోవడంతో జూనియర్ ఆర్టిస్టుగా చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు చెప్పాడని.. అప్పుడు తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని చెబుతూ నరేష్ ఎమోషనల్ అయ్యాడు.

ఇండస్ట్రీకి నటులవుదామని.. డైరెక్టర్లైపోదామని ఎంతో మంది వస్తారని.. కానీ వాళ్లలో అందరికీ అవకాశాలు దొరక్క చివరి లైట్ బాయ్స.. డ్రైవర్లు.. జూనియర్ ఆర్టిస్టులు అవుతున్నారని.. 90 శాతం ఫెయిల్యూర్లే ఉన్న ఇండస్ట్రీ ఇదని నరేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తెరపై సినిమా చూస్తుంటే అంతా బాగున్నట్లు అనిపిస్తుందని.. కానీ సినిమా వాళ్ల జీవితాల వెనుక ఎన్నో విషాదాలుంటాయని నరేష్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు