‘ఒక్క క్షణం’లో అజ్ఞాతవాసి’ డైలాగ్

‘ఒక్క క్షణం’లో అజ్ఞాతవాసి’ డైలాగ్

అల్లు శిరీష్ కొత్త సినిమా ‘ఒక్క క్షణం’ నిన్ననే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మిగతా యంగ్ మెగా హీరోల్లాగే శిరీష్ సైతం మెగా రెఫరెన్సుల్ని బాగానే వాడుకున్నాడు ఈ సినిమాలో. ఒక చోట అతను చెయ్యి కలపబోతే.. కమెడియన్ సత్య ‘నీది మెగా హ్యాండ్’ అంటాడు. మరో చోట తన అన్న అల్లు అర్జున్‌ ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాను గుర్తుకు తెస్తూ.. ఇలా చేస్తూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అంటాడు అల్లు శిరీష్. ఆ వెంటనే ‘రచ్చో రచ్చస్య రచ్చోభ్యహ’ డైలాగ్‌ను అనుకరిస్తూ ఒక డైలాగ్ వస్తుంది.

ఇవన్నీ ఒకెత్తయితే.. త్వరలో విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’లోని డైలాగ్‌ను కూడా ఇందులో వినిపించేశారు. ఆ టీజర్ చివర్లో కొసమెరుపులా వచ్చే ‘‘వీడి చర్యలు ఊహాతీతం’’ అనే డైలాగ్ ఇందులో పెట్టేయడం విశేషం. ‘అజ్ఞాతవాసి’ టీజర్ వచ్చిందే ఈ నెల 16న అంటే.. అందులోని డైలాగ్‌ను ఈ సినిమాలో జొప్పించడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఐతే ఇలాంటి రెఫరెన్సులు కమర్షియల్ సినిమాల్లో అయితే బాగానే ఉంటాయి కానీ.. ‘ఒక్క క్షణం’ లాంటి కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్లో ఇలాంటివి అస్సలు సూటవ్వవు. ఆ విషయం గుర్తించక అల్లు శిరీష్ మెగా అభిమానుల మనసు దోచేందుకు తన ప్రయత్నమేదో తాను చేశాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన ‘ఒక్క క్షణం’ కాన్సెప్ట్ ప్రేక్షకుల్ని థ్రిల్ చేసింది. ఈ చిత్రానికి ద్వితీయార్దం హైలైట్‌గా నిలిచింది. ప్రథమార్ధం కూడా ఆసక్తికరంగా ఉంటే సినిమా రేంజే వేరుగా ఉండేది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు