‘పైసా వసూల్’ హ్యాంగోవర్ వదిలినట్లు లేదే..

‘పైసా వసూల్’ హ్యాంగోవర్ వదిలినట్లు లేదే..

ఈ ఏడాది ఆరంభంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు నందమూరి బాలకృష్ణ. కానీ నందమూరి అభిమానులకు ఆ సినిమా మిగిల్చిన మధుర జ్ఞాపకాల్ని ‘పైసా వసూల్’ తుడిచేసింది. బాలయ్యను చాలా కొత్తగా చూపిస్తా.. అభిమానుల్ని ఉర్రూతలూగిస్తానంటూ పూరి జగన్నాథ్ ఏవేవో కబుర్లు చెప్పి.. చివరికి తన స్టయిల్లో పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమానే వడ్డించాడు. ఈ సినిమా వల్ల బాలయ్యకు ఒరిగిందేమీ లేదు. ఏవో కొన్ని కొత్త మేనరిజమ్స్ ట్రై చేశాడు కానీ.. అవి ప్రేక్షకుల ఆమోదం పొందలేదు. ఐతే ‘పైసా వసూల్’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ.. ఆ సినిమా తాలూకు రెఫరెన్సులు తన కొత్త సినిమా ‘జై సింహా’లో బాలయ్య వాడుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

‘జై సింహా’లో అమ్మకుట్టి అంటూ ఒక పాట ఉంది. ఆ పాట తాలూకు ప్రోమో చూస్తే అందరికీ ‘పైసా వసూల్’ గుర్తుకొస్తోంది. ఆ చిత్రంలో బాలయ్య ఒక ఫైట్ చేసే ముందు చేత్తో వల్గర్‌గా ఒక సంజ్ఞ చేస్తాడు గుర్తుందా? అమ్మ కుట్టి పాటలో కూడా బాలయ్య అలాగే చేశాడు. ఏదైనా హిట్ సినిమాలోంచి.. అందరికీ ఆమోద యోగ్యమైన మేనరిజమ్ ఏదైనా రిపీట్ చేస్తే ఓకే కానీ.. ఇలా అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా నుంచి ఒక వల్గర్ మేనరిజంను మళ్లీ చూపించడమేంటో జనాలకు అర్థం కావడం లేదు.

 మొన్న ‘జై సింహా’ ఆడియో వేడుకలో ‘పైసా వసూల్’ ప్రస్తావన తెస్తూ కొత్తగా ట్రై చేశాం.. యూత్‌లోకి వెళ్లిపోయాం అన్నాడు బాలయ్య. ఈ మాటల్ని బట్టి చూస్తే ‘పైసా వసూల్’ హిట్టని.. దాని వల్ల తనకు చాలా మేలు జరిగిందనే ఫీలింగ్‌లో ఉన్నాడేమో బాలయ్య అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు