బీకామ్ లో ఫిజిక్స్.. నువ్వు కూడానా?

బీకామ్ లో ఫిజిక్స్.. నువ్వు కూడానా?

టాలీవుడ్ లో ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న హీరోల్లో నాగ శౌర్య ఒకరు. ఈ కుర్ర హీరో ప్రయత్నాలు కష్టంగా ఉన్నాయి కానీ ఫలితాలు మాత్రం శూన్యంగా ఉన్నాయి. బీటెక్ ఎగ్జామ్స్ ఎన్ని సార్లు రాసినా పాస్ మార్కుల వరకు లాక్కొచ్చినట్టు సక్సెస్ వరకు లాక్కొస్తున్నాడు గాని సక్సెస్ మాత్రం అందుకోవడం లేదు. అయితే ఫైనల్ గా అవకాశాలను మాత్రం అందుకుంటున్నాడు.

ప్రస్తుతం ఛలో సినిమాతో ఈ హీరో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎలాగైనా హిట్ అందుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ముఖ్యంగా ప్రమోషన్స్ ని అయితే ఓ రేంజ్ లో చేస్తున్నాడు. ఇప్పటికే టీజర్ తో పోస్టర్లతో ఓ వర్గం వారిని ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు మరో డిఫెరెంట్ పోస్టర్ తో నవ్విస్తూ మరికొంతమందిని ఆకర్షిస్తున్నాడు. టీడీపీ లిడర్ జలీల్ ఖాన్ బీకామ్ లో ఫిజిక్స్ ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే దాన్ని గుర్తు చేస్తూ నాగ శౌర్య ఏకంగా బుక్కుతో దర్శనం ఇచ్చాడు. బీకామ్ లో ఫిజిక్స్ అనే ఫార్మాట్ ని చాలా మంది వాడి మెప్పించారు. ఎక్కువగా సోషల్ మీడియాలోనే స్పూఫ్ లు చాలా వచ్చాయి. అది అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే దాని మీద స్పూఫ్ లు వస్తే ఎవరు చూడకుండా ఉండడం లేదు. మరి నాగ శౌర్య ఛలో లో కూడా ఆ తరహా విధానం కనిపిస్తుండడంతో సినిమాపై కొంచెమైనా అంచనాలు పెరుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి నాగ శౌర్య ఎంతవరకు ఆకట్టుకుంటాడో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు