మామా అల్లుడు ఒకే తెరపై!

మామా అల్లుడు ఒకే తెరపై!

ధనుష్ నటుడిగా సత్తా చూపుతున్నాడు. కొలవెరి పాట నుంచి  మనోడి దశ తిరిగింది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆ గుర్తింపుతోనే హిందీలో అవకాశం అందుకున్నాడు. ఆయన చేసిన హిందీ చిత్రం  `రాన్ జానా` చిత్రం చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ధనుష్ కి బాలీవుడ్ నుంచి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. అయితే ధనుషె ఆచి తూచి అడుగేస్తున్నాడు. `రాన్ జానా` దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్  మళ్ళీ ధనుష్ కోసం ఓ కథ సిద్ధం చేసినట్టు సమాచారం.

అయితే ఇందులో రజనీకాంత్ కి కూడా ఓ కీలక పాత్ర ఉందట. మరి ఆయన ఒప్పుకుంటారా లేదా అనేది తేలాలి. రజనీకాంత్ ఇదివరకు హిందీలో నటించారు. కానీ ఇటీవల మాత్రం అక్కడ సినిమా చేయలేదు. `రోబో` హిందీలో అనువాదమై  ఘన విజయం సాధించింది. ఈ దశలో  నేరుగా అక్కడ నటించేందుకు ఒప్పుకుంటారా అన్నదే ప్రశ్న. అయితే ధనుష్ మాత్రం మామని ఒప్పించి తీరతా అంటున్నాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English