కత్తిలాంటి టీవీ యాంకర్‌

కత్తిలాంటి టీవీ యాంకర్‌

టీవీ యాంకర్స్‌లో కూడా కొందరు చాలా వేగంగా పాపులర్‌ అవుతుంటారు. అయితే దురదృష్టం కొద్దీ టీవీ యాంకర్స్‌ హీరోయిన్స్‌గా రాణించలేకపోతుంటారు. వారి బుల్లితెర ఇమేజ్‌ వారికి ప్రతిబంధకంగా మారుతుంటుంది. అయినప్పటికీ బుల్లితెర మహరాణులుగా అభిమానుల్ని సంపాదించుకుని తన పరిధిలో స్టార్స్‌ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు.

రీసెంట్‌ టైమ్స్‌లో టీవీ యాంకర్లలో బాగా పాపులర్‌ అయింది అనసూయ. పేరు పాతరకంగా ఉన్నా కానీ ఈమె కాంటెంపరరీ ఫ్యాషన్స్‌ అన్నీ ఫాలో అవుతుంది. చక్కని ఒడ్డూ పొడవూ ఉన్న అనసూయకి బుల్లితెర అనుష్క అనే ముద్దు పేరు కూడా ఉంది. జబర్దస్త్‌ కార్యక్రమంతో లైమ్‌ లైట్‌లోకి వచ్చిన అనసూయ వెండితెరపై అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తోంది.

అచ్చమైన తెలుగు సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనంలా ఉండే అనసూయ వెండితెరపై ఎంతవరకు సక్సెస్‌ అవుతుందనేది చూడాలి. ఈమె కనుక ఇక్కడ సక్సెస్‌ కాగలిగితే టీవీ ద్వారా పరిచయం అయితే సినిమా కెరీర్‌ ఖతం అనుకునే వారి అనుమానాలు తొలగిపోయి బుల్లితెరపై మక్కువ పెరుగుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు