మూడో సినిమా కూడా దిల్ రాజు బేనర్లోనే

మూడో సినిమా కూడా దిల్ రాజు బేనర్లోనే

తన బేనర్లో ఎవరు దర్శకుడిగా పరిచయమైనా వాళ్లు సక్సెస్‌తోనే బయటికి వెళ్లాలన్నది దిల్ రాజు పట్టుదల. సుకుమార్, బొమ్మరిల్లు భాస్కర్, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి.. ఇలా ఎంతోమంది దర్శకులకు లైఫ్ ఇచ్చాడు దిల్ రాజు. వంశీ పైడిపల్లి తొలి సినిమా ‘మున్నా’ ఫ్లాప్ అయినప్పటికీ.. ఆ తర్వాత అతడితో ‘బృందావనం’, ‘ఎవడు’ సినిమాలతో హిట్లు కొట్టించి ఆ తర్వాత బయటికి వదిలాడు.

ఆపై రాజు ఫోకస్ వేణు శ్రీరామ్ మీదికి మళ్లింది. దిల్ రాజు బేనర్లో ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు వేణు. కానీ ఆ సినిమా ఆడలేదు. అయినప్పటికీ అతడితోనే ‘ఎంసీఏ’ తీశాడు. ఇది కమర్షియల్‌గా మంచి సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది.

ఐతే తొలి హిట్ కొట్టాక కూడా వేణు శ్రీరామ్ దిల్ రాజు బేనర్ నుంచి బయటికి వెళ్లట్లేదట. అతను తన తర్వాతి సినిమాను కూడా రాజు బేనర్లోనే చేయబోతున్నాడట. ‘ఎంసీఏ’ విడుదలయ్యాక రాజు తనకు ఫోన్ చేసి అభినందించాడని.. ఇదే బేనర్లో తన మూడో సినిమా చేయడానికి కూడా ఓకే చెప్పాడని వేణు వెల్లడించాడు. ‘ఓ మై ఫ్రెండ్’ ఆడకపోయినా.. తన మీద నమ్మకంతో మళ్లీ అవకాశమిచ్చిన దిల్ రాజుకు రుణపడి ఉంటానని అన్నాడు.

 ‘ఓ మై ఫ్రెండ్’ కాన్సెప్ట్‌ను  జనాలు ఆమోదించలేదని.. ఐతే తన నిజ జీవితంలోని వ్యక్తులు, సంఘటనల ఆధారంగా ‘ఎంసీఏ’ తీశానని.. సినిమాలో కనిపించే వదిన-మరిది బంధం తాలూకు సన్నివేశాలన్నీ తన జీవితం నుంచి తీసుకున్నవే అని అతనన్నాడు. ‘ఎంసీఏ’ సినిమా తాము ఆశించిన దాని కంటే పెద్ద విజయం సాధించిందని వేణు చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English