మహేష్, బన్నీలకు రజినీ ఫిట్టింగ్ పెట్టినట్లే

మహేష్, బన్నీలకు రజినీ ఫిట్టింగ్ పెట్టినట్లే

జనవరి 25న రావాల్సిన ‘2.0’ సినిమాను ఏప్రిల్‌కు వాయిదా వేస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఏప్రిల్ రిలీజ్ అన్నారే తప్ప.. పక్కాగా రిలీజ్ డేట్ ఇవ్వలేదు. కొందరేమో ఏప్రిల్ 13న సినిమా వస్తుందన్నారు. ఇంకొందరేమో ఏప్రిల్ 27న రిలీజ్ అన్నారు. 13న అయితే టాలీవుడ్ జనాలకు ఇబ్బందేమీ లేదు. 27న అయితేనే సమస్య అంతా.

అదే రోజుకు ఇటు మహేష్ బాబు సినిమా ‘భరత్ అను నేను’.. అటు అల్లు అర్జున్ మూవీ ‘నా పేరు సూర్య’ను షెడ్యూల్ చేసి పెట్టుకున్నారు. కానీ ‘2.0’ అదే రోజుకు వస్తుందన్న ప్రచారంతో ఈ రెండు చిత్రాల నిర్మాతలూ ఉలిక్కి పడ్డారు. ‘2.0’ నిర్మాతల్ని హెచ్చరిస్తూ ప్రకటనలు కూడా ఇచ్చారు.

ఐతే వీళ్ల హెచ్చరికలకు ‘2.0’ నిర్మాతలేమీ జంకినట్లు లేరు. వాళ్లు ఏప్రిల్ 27కే ఫిక్సయినట్లున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 13న రాదనడానికి సూచికగా విశాల్ తన కొత్త సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు. తన లేటెస్ట్ మూవీ ‘ఇరుంబుతురై’ (తెలుగులో అభిమన్యుడు) టీజర్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన తర్వాతి సినిమా ‘సెండకోళై-2’ (పందెంకోడి-2) ఏప్రిల్ 14న రిలీజవుతుందని ప్రకటించాడు. దీన్ని బట్టి 13న ‘2.0’ రాదని స్పష్టమైనట్లే.

ఏప్రిల్ 13కు ‘2.0’ రెడీ అయ్యే అవకాశమే లేదని.. 27 అయితేనే అన్ని రకాలుగా మంచిదని నిర్మాతలు ఫిక్సయ్యారట. ఈ విషయమై కోలీవుడ్ పూర్తి స్పష్టతతో ఉంది. ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలే స్పష్టత తెచ్చుకోవాల్సి ఉంది. అందుకనుగుణంగా తమ సినిమాల రిలీజ్ డేట్లు ప్లాన్ చేసుకుంటే బెటరేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు