అదే బెస్ట్ నైట్ అంటున్న అమీ

అదే బెస్ట్ నైట్ అంటున్న అమీ

బ్రిటిష్ అందం అమీ జాక్సన్.. ఇండియన్ మూవీస్ లో బాగానే వెలిగిపోతోంది. సెలెక్టెడ్ గా సినిమాలు చేసే ఈ సుందరాంగి.. అందాల ఆరబోత విషయంలో ఎంత మాత్రం తగ్గదు. అలాగని అన్ని రకాల పాత్రలు ఒప్పేసుకుంటుందా అంటే.. అదీ లేదు. ఇటు భారీ ప్రాజెక్టులు అయి ఉండాలి.. పేరున్న దర్శకుడు.. హీరో ఉండాలి.. భారీ బడ్జెట్ ఉండాలి. వీటితో పాటే తనకు కూడా గట్టిగా రెమ్యూనరేషన్ ముట్టాలి.

అమీ జాక్సన్ సినిమా చేయాలంటే ఇన్నేసి కండిషన్స్ ఉంటాయని టాక్. అయితే.. ఈ భామ ఈవెంట్స్ లో కూడా అందాల మెరుపులు మెరిపించేస్తుంటుంది. ఆన్ స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ యథేచ్ఛగా బ్యూటీ చూపించగల దిట్ట అమీ జాక్సన్. ఇప్పుడు భారీ రేంజ్ లో ఎక్స్ పోజింగ్ చేస్తున్న ఓ పిక్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది అమీ జాక్సన్. ఇంతగా లోనెక్ డ్రెస్ లో ఉన్నపుడు ఆ మేకప్ రూం ఫోటోను షేర్ చేసే ధైర్యం అందరూ చేయలేరు. కానీ ఆ పని చేసేసిన అమీ జాక్సన్.. ఇదే బెస్ట్ నైట్ ఆఫ్ ది ఇయర్ అని కూడా చెప్పేసి.. అందుకు సంబంధించిన ఈవెంట్ డీటైల్స్ ను హ్యాష్ ట్యాగుల రూపంలో తగిలించింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. రోబో సీక్వెల్ 2.ఓ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసిన ఈ బ్యూటీ.. మర మనిషిగా తన అద్భుత నటనను ఇప్పటికే ప్రదర్శించేసింది. కానీ అమ్మడి ట్యాలెంట్ ను మనం చూడాలంటే మాత్రం ఏప్రిల్ చివరి వరకూ ఆగాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English