500 అంటే కష్టమేమో సురేష్ బాబూజీ

500 అంటే కష్టమేమో సురేష్ బాబూజీ

వన్స్ అపాన్ ఏ టైం.. ప్రతీ వీకెండ్ లో సినిమా థియేటర్లు తెగ కళకళలాడిపోయేవి. అందుకే శుక్రవారాలు సినిమాలు రిలీజ్ చేయడం కూడా ఆనవాయితీ. మొదటిరోజు ఎలాగూ జనాలు చూస్తారు. శనాదివారాలు టైంపాస్ కోసం ఫ్యామిలీస్ తో కలిసి థియేటర్లకు వస్తారు. ఇదీ ఇప్పటివరకూ సినిమాలు తీసేవాళ్ల లెక్క. కానీ కొంత కాలంగా పరిస్థితుల్లో మార్పులు వచ్చేస్తున్నాయి.

జనాలు థియేటర్లకు రావడం తగ్గిపోతోంది. ఒకవైపు టీవీ కంటెంట్ లో పెరిగిన క్వాలిటీ.. సినిమాలకు రావాలంటే పెరిగిన ఖర్చులు.. ఎంటర్టెయిన్మెంట్ ఆప్షన్స్ పెరగడం లాంటివి.. థియేటర్లకు వచ్చే జనాల సంఖ్య తగ్గిపోవడానికి కారణం అయ్యాయి. ఈ ఏడాది బాహుబలి2.. ఖైదీ నంబర్ 150లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నా.. టోటల్ గా చూస్తే మాత్రం సినిమా థియేటర్లకు వచ్చే జనాల సంఖ్య తగ్గిపోయిందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. గత కొంత కాలంగా ఇలాంటి సిట్యుయేషన్ ఉన్నా.. 2017లో మరీ దారుణంగా తగ్గిందని అంటున్నారు. అందుకే జనాలకు మంత్లీ పాస్ లు ఇవ్వడం ద్వారా.. సినిమా థియేటర్లకు వచ్చేలా చేయాలని చూస్తున్నారట ఎగ్జిబిటర్స్. ఇప్పటికే నిర్మాతల వైపునకు ఈ ప్రపోజల్ పంపడం.. వారి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం కూడా జరిగిందని తెలుస్తోంది.

 ఒక్కో వ్యక్తికి 500 నుంచి 800 రూపాయల చొప్పున వసూలు చేయాలని.. ఇలా వచ్చే మొత్తాన్ని ప్రొడ్యూసర్స్- ఎగ్జిబిటర్స్ షేర్ చేసుకోవాలని ఐడియాలు వేస్తున్నారట. నిజానికి ఇలాంటి పాస్ ల స్కీం హైద్రాబాద్ లో ఇప్పటికే ఉంది. కానీ దీనికి రెస్పాన్స్ తక్కువే. ఇందుకు కారణాలు అనేకం. వాటిలో రెగ్యులర్ గా సినిమాలు చూడాల్సిన అవసరం కూడా ఒకటి. ఈ పాస్ కోసం కట్టిన డబ్బులు క్యారీ ఫార్వార్డ్ కావు. అదే నెలలో వాడేసుకోవాలి. 500పెట్టి పాస్ కొన్నవాళ్లక వర్కవుట్ అవాలంటే నెలకు కనీసం 5 సినిమాలు చూడాలి. లేకపోతే వేస్ట్ అయినట్లే.

అన్నేసి సినిమాలు థియేటర్లో చూసే ఓపిక ఎంతమందికి ఉందన్నది ప్రశ్నార్ధకమే. అదే ఏ వందో రెండొందలో అంటే కాసింత వర్కవుట్ అవుతుందని జనాల భావిస్తారు. పైగా ఫ్యామిలీతో సినిమా అంటే.. టికెట్ కంటే ఇతర ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. మరి సురేష్ బాబు ఆలోచన ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు