నయన్ అందుకే ఇబ్బంది పెడుతోందా?

నయన్ అందుకే ఇబ్బంది పెడుతోందా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఖైదీ నంబర్ 150తో బ్యాంగ్ బ్యాంగ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరు.. తర్వాతి సినిమా విషయంలో తన కెరీర్ కే కాదు.. టాలీవుడ్ కే తలమానికంగా ఉండాలని భావించారు. అందుకే చరిత్ర ఆధారిత కథ ఎంచుకుని భారీ బడ్జెట్ తో రూపొందించేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటులను ఎంచుకున్నారు.

ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రెండో షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఈ చిత్రంలో లీడ్ అయిన నయనతార డేట్స్ కేటాయించడంలో అలసత్వం చూపుతోందట. ఈ మూవీకి గ్రాఫిక్స్ అవసరం చాలానే ఉండడంతో.. ముందుగా హీరో-హీరోయిన్ సీన్స్ ను పూర్తి చేసి గ్రాఫిక్ పనులు కూడా సైమల్టేనియస్ గా ప్రారంభించాలన్న దర్శకుడు సురేందర్ రెడ్డి ఆలోచనలకు.. నయన్ కారణంగా బ్రేక్ పడుతోందని తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసేందుకు ఒప్పుకున్న నయనతార.. డేట్స్ కేటాయింపులో మాత్రం ఇంకా ఆలోచిస్తూనే ఉందని అంటున్నారు. టాలీవుడ్ లో ఈమె బాలకృష్ణ- వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో మాత్రమే కనిపిస్తోంది.

ఇప్పుడు చిరంజీవి కూడా సీనియర్ హీరోనే. ఈ చిత్రం తర్వాత తనను సీనియర్ హీరోయిన్ అనే స్టాంప్ వేస్తారని భయపడుతోందని టాక్. ఖైదీ నంబర్ 150 సమయంలోనే ఈమెతో సంప్రదింపులు జరిపినా రెమ్యూనరేషన్ సెట్ కాలేదు. ఇప్పుడు పేమెంట్ బాగానే ముట్టిందని యాక్సెప్ట్ చేసినా.. ఇతర ఆలోచనలతో సైరా విషయంలో తాత్సారం చేస్తోందనే టాక్ వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు