అజ్ఞాతవాసిలో అసలు బొనాంజా అదే!

అజ్ఞాతవాసిలో అసలు బొనాంజా అదే!

అజ్ఞాతవాసి టీజర్లో చాలా క్యారెక్టర్లని చూపించేసారు కానీ అసలు సంచలనాన్ని దాచి వుంచారు. ఈ చిత్రంలో వెంకటేష్‌ అతిథి పాత్ర చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది అలా కొన్ని నిమిషాల పాటు కనిపించి మాయమయ్యే అతిథి పాత్ర కాదని, ఈ చిత్రం కోసం వెంకీ పది రోజుల కాల్షీట్లు ఇచ్చాడని, అతని పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా, సినిమాకి మెయిన్‌ ఎట్రాక్షన్‌గా వుంటుందని సమాచారం. ఈ క్యారెక్టర్‌ని సరాసరి తెర మీదే రివీల్‌ చేయాలా లేక ట్రెయిలర్‌లో చిన్న టీజ్‌ ఇవ్వాలా అనే దానిపై త్రివిక్రమ్‌ ఆలోచిస్తున్నాడట.

ట్రెయిలర్‌లో వెంకీ పాత్రని అలా మెరుపులా చూపిస్తే బాగుంటుందని త్రివిక్రమ్‌ భావిస్తున్నాడని, అయితే దానిని పూర్తిగా హిడెన్‌ మోడ్‌లో వుంచితే ఫస్ట్‌ డే ఇంపాక్ట్‌ బాగుంటుందని మరో డిస్కషన్‌ కూడా జరుగుతోందని తెలిసింది. మరి ఫైనల్‌గా వెంకీని ట్రెయిలర్‌లోనే చూపిస్తారో లేక రిలీజ్‌ అయ్యాక తెర మీదే చూడాలో వేచి చూడాల్సిందే. ఈ చిత్రంలో కమర్షియల్‌గా అన్ని అంశాలని ప్యాక్‌ చేయడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో మిస్‌ఫైర్‌ కాదనే ధీమా చిత్ర వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు బిజినెస్‌ వర్గాల్లోను అదే నమ్మకం వుందని స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి వస్తోన్న హైర్లుచూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు