అల్లు అరవింద్‌ బుర్రే బుర్ర

అల్లు అరవింద్‌ బుర్రే బుర్ర

ఒక్క క్షణం చిత్రాన్ని డిసెంబర్‌ 23న విడుదల చేద్దామని ముందుగా అనుకున్నారు. శనివారం రిలీజ్‌ చేస్తే సోమవారం ఎలాగో పబ్లిక్‌ హాలిడే కలిసి వస్తుందని భావించారు. అందుకే త్రిముఖ పోటీకి కూడా సిద్ధపడి ఎంసిఏ, హలోతో పాటు దీనిని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు. అయితే అల్లు అరవింద్‌ పూనుకుని ఒక్క క్షణం చిత్రాన్ని వాయిదా వేయించారు. ఎంసిఏతో పోటీ పడి హలో చిత్రం నలిగిపోతోన్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలతో పోటీ పడినట్టయితే ఒక్క క్షణం చాలా స్ట్రగుల్‌ అయి వుండేది. కానీ సెలవుల కోసం చూడకుండా తదుపరి వారానికి వాయిదా వేయడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ అవుతుంది.

ఎంసిఏ ఎలాగో అప్పటికి చల్లబడిపోతుంది కనుక, హలో కూడా నెమ్మదిస్తుంది కనుక, ఆడియన్స్‌ కొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకుంటారు కనుక ఈవారంలో ఒక్క క్షణం చిత్రానికి అడ్వాంటేజ్‌ అవుతుంది. ఎలాగో సంక్రాంతి సినిమాలు రావడానికి రెండు వారాల సమయం వుంటుంది కనుక ఈలోగా ఈ చిత్రం రాబట్టుకునే వసూళ్లు రాబట్టుకోవచ్చు. ప్రస్తుతం సినిమాలు తీయడం కంటే కూడా వాటి రిలీజ్‌ని సరిగ్గా ప్లాన్‌ చేయడం విజయానికి కీలకంగా మారింది. ఈయేడు టైమింగ్‌ పరంగా తప్పుడు లెక్క వేసి దెబ్బతిన్న నిర్మాతలు చాలా మందే వున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English