అజ్ఞాతవాసి... అయిదు రోజులకో పండగ

అజ్ఞాతవాసి... అయిదు రోజులకో పండగ

క్రిస్మస్‌కి వస్తుందని అనుకున్న అజ్ఞాతవాసి ట్రెయిలర్‌ లాంఛ్‌ అవలేదు. మరో పది రోజుల వరకు ట్రెయిలర్‌ రాదని విశ్వసనీయ సమాచారం. ముందుగా 'కొడుకా కోటేశ్వరరావు' అంటూ పవన్‌ కళ్యాణ్‌ పాడిన పాట మేకింగ్‌ వీడియోని డిసెంబర్‌ 31న విడుదల చేస్తారట. అది వచ్చిన అయిదు రోజులకి అంటే జనవరి 5న ట్రెయిలర్‌ వస్తుందట. అది వచ్చిన అయిదు రోజులకి సినిమా రిలీజ్‌ అవుతుంది. కనుక ప్రతి అయిదు రోజులకో పండగ వుంటుందని అజ్ఞాతవాసి చిత్ర వర్గాలు అభిమానులని ఊరిస్తున్నాయి. పబ్లిసిటీ సడన్‌గా డౌన్‌ అయిందని, ఆడియో రిలీజ్‌ వరకు సందడి బాగా చేసి తర్వాత సైలెంట్‌ అయ్యారని అభిమానులు ఫీలవుతున్నారు.

ట్రెయిలర్‌ని మరీ అంత లేట్‌గా కాకుండా ముందుగా విడుదల చేసి, సినిమా విడుదలకి ముందు టెన్‌ సెకండ్స్‌ టీజర్లు, సాంగ్‌ వీడియోలు విడుదల చేస్తే మైలేజ్‌ బాగుంటుందని ఫాన్స్‌ అభిప్రాయ పడుతున్నారు. అయితే పవన్‌ కళ్యాణ్‌ సినిమాకి మరీ ఆ స్థాయిలో పబ్లిసిటీ అక్కర్లేదని, మరో రెండు దఫాల పబ్లిసిటీతో రావాల్సిన క్రేజ్‌ కంటే రెండింతలు అదే వస్తుందని త్రివిక్రమ్‌ అంటున్నాడట. అదీ నిజమే కానీ ఫాన్స్‌కుండే ఫీలింగ్స్‌ వాళ్లకి వుంటాయిగా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు