డివైడ్ టాక్.. అయినా 30 గ్యారెంటీ

డివైడ్ టాక్.. అయినా 30 గ్యారెంటీ

నాని విన్నింగ్ స్ట్రీక్‌కు ఎప్పుడు బ్రేక్ పడుతుందా అని చూస్తున్నారు అతడి వ్యతిరేకులు. కానీ ఈసారి కూడా అది జరిగేట్లు కనిపించడం లేదు. గత మూడేళ్లలో నాని చేసిన ఏ సినిమాకూ లేని స్థాయిలో ‘ఎంసీఏ’కు నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను క్రిటిక్స్ తీసి పడేశారు. ప్రేక్షకులు కూడా దీనిపై పెదవి విరిచారు. సెకండాఫ్ వేస్ట్ అని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించేశారు. సినిమాలో ఓ సగం బాలేదన్న టాక్ వచ్చినపుడు అదెలా ఆడుతుంది..? కానీ ‘ఎంసీఏ’ మాత్రం ఆడేస్తోంది.

చాన్నాళ్లుగా తెలుగులో కొంచెం పెద్ద స్థాయి.. జనాల్ని థియేటర్లకు రప్పించే సినిమా లేదు. కొన్ని వారాలుగా థియేటర్లు వెలవెలబోతున్నాయి. పైగా నాన్ మాంచి ఫామ్‌లో ఉన్నాడు. క్రిస్మస్ వీకెండ్ కూడా కలిసొచ్చింది. దీంతో ‘ఎంసీఏ’ ఐదు రోజుల్లోనే రూ.22 కోట్ల దాకా షేర్ రాబట్టడం విశేషం. విడుదలైన ఐదో రోజు కూడా ఈ చిత్రానికి మూడున్నర కోట్ల షేర్ రావడం అనూహ్యమైన విషయమే.

‘ఎంసీఏ’కు పోటీగా వచ్చిన ‘హలో’ టాక్ బాగున్నప్పటికీ వసూళ్లు అందుకు తగ్గట్లుగా లేవు. ఆ చిత్రం ఎ సెంటర్లలో మాత్రమే బాగా ఆడుతోంది. బి-సి సెంటర్లలో ‘ఎంసీఏ’ రాజ్యమే నడుస్తోంది. దీంతో ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.30 కోట్ల షేర్ మార్కును దాటి బయ్యర్లను బయట పడేసేందుకు మంచి అవకాశాలు ఉన్నట్లే. దీని కంటే ముందు దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ కూడా డివైడ్ టాక్ ను తట్టుకుని రూ.30 కోట్ల షేర్ సాధించింది. ఆ సినిమాకు దీపావళి సీజన్ కలిసొస్తే.. ‘ఎంసీఏ’కు క్రిస్మస్ సీజన్ కలిసొచ్చింది. మొత్తానికి దిల్ రాజు లక్కీ అనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English