సినిమా ఏంటో అక్కడే తెలిసిపోతుంది

సినిమా ఏంటో అక్కడే తెలిసిపోతుంది

ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక ఏడాది రెండు.. మూడు సినిమాలు రావడమే గొప్ప అనిపించే రోజులివి. అలాంటిది ఒకే ఏడాదిలో ఆరు సినిమాలు రావడం.. ఆరూ కాసులు రాబట్టడం అనేది ఓ రకంగా అరుదైన రికార్డే. టాలీవుడ్ లో దిల్ రాజు డబుల్ హ్యాట్రిక్ ఫీట్ సాధించాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఈ ఘనత తన ఒక్కడిది కాదని.. ప్రతి సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు మొదలుకొని ఆరుగురు డైరెక్టర్లు.. టెక్నీషియన్స్ తోపాటు ఆఖరుకు తన ఆఫీస్ లో అకౌంట్స్ వరకు అందరి సహాయం ఉందని సభాముఖంగా చెప్పాడు దిల్ రాజు.

సినిమాపై అంటే తనకు పిచ్చి అని.. అదే సక్సెస్ లు రావడానికి కారణమైందని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ‘‘సినిమా ఊరికే ఆడేయదు. నా వరకు అదో పిచ్చి. ఒక ట్యూన్ వచ్చిందంటే వెంటనే వినెయ్యాలి. సినిమా ఎవరైనా డబుల్ పాజిటివ్ చూస్తున్నారు అంటే నేను గేట్ కీపర్ లా బయటే నిలబడాలి. సినిమా చూసినవాళ్ల ఫేసులో రియాక్షన్ ఏమిటో నాక్కావాలి. అప్పుడే పరిస్థితి ఏమిటో అర్ధమైపోతుంది. నేను ఎక్కడో ఉండి ఎవరిని ఫోనులో వివరాలు అడగను. రీరికార్డింగ్ తరవాత చూసినవాళ్ల మొదటి రియాక్షనే సినిమా. అక్కడే తెలిసి పోతుంది. సినిమా బాగుందా లేదా అన్నది. అలా చేసుకుంటూ వచ్చినవే ఈ ఆరు సినిమాలు’’ అంటూ సినిమా పట్ల తనకున్న ప్యాషన్ ఏమిటో.. దాన్నెలా జడ్జ్ చేస్తాడో దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

‘‘ఇండస్ట్రీలో సక్సెస్ కు ఉన్న గుర్తింపు దేనికీ ఉండదు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు చాలా త్వరంగా కుంగిపోతాం. అలాంటప్పుడు మోరల్ సపోర్ట్ ఎంతో అవసరం. కష్టాల్లో ఉన్నప్పుడు అదెంత అవసరమో నాకు తెలుసు. అందుకే ఫెయిల్యూర్ డైరెక్టర్స్ కు మళ్లీ అవకాశం ఇచ్చాను. ఈరోజు వాళ్లు సక్సెస్ పుల్ డైరెక్టర్లుగా నిలదిక్కుకోవడం ఆనందాన్ని ఇస్తోందంటూ’’ దిల్ రాజు తన ఫీలింగ్ పంచుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English