అది సరైనోడు సీక్వెల్ కాదు కదా!!

అది సరైనోడు సీక్వెల్ కాదు కదా!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ త్వరలోనే 'రంగస్థలం' సినిమా షూటింగుకు స్వస్తి పలకనున్నాడట. సినిమా మార్చిలో రిలీజవ్వనున్నా కూడా.. షూటింగ్ మాత్రం ఓ రెండు నెలల ముందే అయిపోతోంది. అయితే మనోడు ఆ తరువాత వెంటనే బోయపాటి శ్రీను సినిమా నిమిత్తం షూటింగ్ మొదలెట్టనున్నాడు. ఇక గ్యాప్ ఉంటే 'సైరా' తాలూకు పనులు చూసుకుంటాడట.

విషయం ఏంటంటే.. ఇప్పుడు రంగస్థలం తరువాత చరణ్‌ చేయబోయే సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. బోయపాటి డైరక్షన్లో రూపొందే ఈ సినిమా షూటింగ్ 80% వరకు రాజస్థాన్ లోనే జరగనుందట. మొత్తం అక్కడి ఎడారిల్లో రాజమహల్స్ లో పూర్తి చేసి.. ఆ తరువాత ఇక్కడికి రానున్నారట. అయితే అసలు రాజస్థాన్ ఎడారిలో షూటింగ్ అంటే.. దాదాపు అన్నీ యాక్షన్ చేజులే ఉన్నాయా అనే సందేహం వస్తోంది. అంటే 'సరైనోడు' సినిమా తరహాలో.. ఊ అంటూ ఫైట్.. ఆ అంటే యాక్షన్ సీక్వెన్స్.. అన్న చందాన బోయపాటి మళ్ళీ బండి నడిపించి.. సరైనోడు సినిమాకు సీక్వెల్ ఏదైనా తీస్తాడా అనే సందేహం వస్తోంది.

నిజానికి బోయపాటి తీసిన  జయ జానకి నాయక సినిమా ఆల్రెడీ సరైనోడుకు సీక్వెల్ తరహాలోనే ఉంటుంది. ఇప్పుడు రామ్ చరణ్‌ సినిమా కూడా అదే తరహాలో కథ తక్కువ కొట్టుడు ఎక్కువ అన్నట్లు డిజైన్ చేస్తే మాత్రం.. బాక్సాఫీస్ దగ్గర చాలా తేడా వచ్చేశే సీనుంది. అసలు చరణ్‌ అలాంటి మాస్ సినిమాలను చేస్తుంటే ఈమధ్యన జనాలు కూడా పెద్దగా లైక్ చేయట్లేదు. జాగ్రత్త బాసూ!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు