`ఎంసీఏ`లో ఆ సీన్లుంటే బాగుండేదా?

`ఎంసీఏ`లో ఆ సీన్లుంటే బాగుండేదా?

ఫిదా సినిమాలో త‌న న‌ట‌న‌, డైలాగుల‌తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను సాయి ప‌ల్ల‌వి మెస్మ‌రైజ్ చేసింది. తెలంగాణ యాస‌లో ఈ హైబ్రిడ్ పిల్ల చెప్పిన డైలాగుల‌కు ప్రేక్ష‌కుల‌తో పాటు క్రిటిక్స్ కూడా ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో అద్భుతంగా న‌టించిన ఈ త‌మిళ బ్యూటీ ...న్యాచుర‌ల్ స్టార్ నానితో క‌లిసి `ఎంసీఏ`లో న‌టించింది. దీంతో, ఆ సినిమాలో కూడా సాయి ప‌ల్ల‌వి క్యారెక్ట‌ర్ ఫిదా రేంజ్ లో కాక‌పోయినా...ఓ మోస్త‌రుగా ఉంటుంద‌ని ప్రేక్ష‌కులు ఊహించుకున్నారు. అయితే, ఎంసీఏలో స్టోరీ మొత్తం నాని, భూమిక‌ల మ‌ధ్యే ఎక్కువ‌గా తిరగ‌డంతో సాయి ప‌ల్లవి పాత్ర‌కు పెద్ద ప్రాధాన్యం లేకుండా పోయింది. ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా అలాగే అనుకున్నార‌ట‌. అయితే, సాయి ప‌ల్ల‌వి క్యారెక్ట‌ర్ నుంచి ఏదో ఆశించి వ‌చ్చిన ప్రేక్ష‌కులు భంగ‌ప‌డ‌డంతో దిల్ రాజు ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. నాని-సాయి ప‌ల్ల‌వి ల మ‌ధ్య నాలుగు రొమాంటిక్ సీన్ల‌ను దిల్ రాజు లేపేయ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.  

ఈ ఏడాది సిక్స‌ర్ కొట్టేశామ‌ని దిల్ రాజు చెబుతున్నా....లోలోప‌ల మాత్రం ఎంసీఏ క‌లెక్ష‌న్ల‌పై కొద్దిగా అసంతృప్తితో ఉన్న‌ట్లు  తెలుస్తోంది. `ఎంసీఏ`లో నాని - భూమిక ల మధ్య సీన్స్ హైలైట్ అవుతాయని దిల్ రాజు భావించారట. దీంతో, నాని - సాయిపల్లవి మధ్య గల నాలుగు రొమాంటిక్ సీన్స్ క‌ట్ చేశార‌ట‌. అయితే, హీరో .. హీరోయిన్స్ మధ్య మ‌రి కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటే బాగుండేద‌నే టాక్ వ‌చ్చింద‌ట‌. ఆ సీన్స్ ఉంటే ఎంసీఏకు మ‌రింత కిక్ వ‌చ్చేద‌ని, అవి లేని ఎఫెక్ట్ కథపై బాగానే పడిందనే టాక్ వినిపిస్తోండ‌డంతో, ఆ సీన్స్ ఉంచినా పోయేద‌ని దిల్ రాజు ఫీలవుతున్నారట. అయితే, చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న‌ట్లు ఇపుడు ఆ సీన్స్ ను  యాడ్ చేస్తారా....లేక అలాగే వ‌దిలేస్తారా అన్నది ఆస‌క్తిక‌రంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English