సినిమా కాదు.. ఆ కాంబోలో వెబ్ సిరీస్

సినిమా కాదు.. ఆ కాంబోలో వెబ్ సిరీస్

విక్టరీ వెంకటేష్- భల్లాలదేవుడు రానాలను ప్రధాన పాత్రలలో చూపిస్తూ.. ఓ మల్టీ స్టారర్ మూవీ చేయాలనే ఆలోచన చాలా కాలంగా సాగుతోంది. ఇగోలకు పోని ఈ ఇద్దరు హీరోలు ఇప్పటికే తమ అంగీకారం చెప్పేశారు కూడా.

పలువురు దర్శకులు.. కథా రచయితలతో కలిసి ఈ కాంబినేషన్ ను వర్కవుట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఈ ప్రాజెక్టు మాత్రం సాధ్యం కాలేదు. ఇప్పుడు మాత్రం వీరి కాంబినేషన్ సెట్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇది సినిమా కోసం కాదట. వెంకటేష్.. రానా ఇద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారని తెలుస్తోంది. ఎఎంఆర్ రమేష్ అనే దర్శకుడు ఈ వెబ్ సిరీస్ ను రూపొందించబోతున్నాడు. ఒకేసారి పలు భాషల్లో ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్ లలో రానా నటించాడు కానీ.. వెంకటేష్ కు మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం.

వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ చిత్రంలో వెంకటేష్ నటిస్తున్నాడు. రానా విషయానికి వస్తే 1945 అంటూ ఓ పీరియాడిక్ మూవీలో నటిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English