ఇప్పుడు నాని రేంజే వేరు

ఇప్పుడు నాని రేంజే వేరు

రెండేళ్ల క్రితం వరకు నాని చిత్రాలకి నామమాత్రపు ఓపెనింగ్స్‌ వచ్చేవి కావు. టాక్‌ వచ్చిన సినిమాలకి కూడా వసూళ్లు రాని సిట్యువేషన్‌ని దాటి ఇప్పుడు తన సినిమాలకి గ్యారెంటీ వసూళ్లు రాబట్టే స్టార్‌గా ఎదిగాడు. నాని గత రెండు చిత్రాలకి ముప్పయ్‌ కోట్ల రేంజిలో షేర్‌ వచ్చింది. దాంతో అతని తాజా చిత్రం ఎంసిఏకి డైరెక్టర్‌తో సంబంధం లేకుండా ముప్పయ్‌ కోట్ల బిజినెస్‌ జరిగింది.

మొదటి నాలుగు రోజుల్లోనే ఇరవై కోట్లకి పైగా షేర్‌ రాబట్టిన నాని తన సత్తా ఏమిటనేది చూపించాడు. క్రిస్మస్‌ తర్వాత వసూళ్లలో గణనీయమైన తగ్గుదల వచ్చినా కానీ బయ్యర్లు సేఫ్‌ అయిపోతారని ట్రేడ్‌ టాక్‌. టాక్‌ ఏమంత ఆశాజనకంగా లేని సినిమాతో నాని సాధిస్తోన్న వసూళ్లు చూసి ట్రేడ్‌ వర్గాలు సైతం విస్మయం చెందుతున్నాయి. మిడిల్‌ రేంజ్‌లో నాని గతంలో రవితేజ మాదిరిగా మినిమం గ్యారెంటీ హీరోగా మారిపోయాడు. అతని సినిమాలకి ఇప్పుడు ముప్పయ్‌ కోట్ల వసూళ్లు అవలీలగా వచ్చి పడుతున్నాయి. స్టార్‌ దర్శకుల చూపు తనపై పడకుండానే నాని ఇప్పుడు టాప్‌ రేంజ్‌కి చేరుకున్నాడు.

ఇక పెద్ద దర్శకులు అతనితో పని చేయడం మొదలు పెడితే నాని ఏ రేంజ్‌కి వెళతాడనేది ఊహించడం కూడా కష్టమే. ఈమధ్య కాస్త రొటీన్‌ అవుతోన్న నాని రాబోయే రోజుల్లో అలా జరగకుండా జాగ్రత్త పడితే కనుక ఇప్పుడున్న మార్కెట్‌ స్టేబుల్‌ అవడంతో పాటు మరింత పెద్ద రేంజ్‌కి వెళ్లడం కూడా కష్టం కాకపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు