జైసింహాని తక్కువ చేయొద్దు

జైసింహాని తక్కువ చేయొద్దు

సంక్రాంతికి అజ్ఞాతవాసితో పాటు బాలకృష్ణ సినిమా జై సింహా రిలీజ్‌ అవుతున్నప్పటికీ పోటీ వన్‌ సైడెడ్‌ వుంటుందన్నట్టే అంతా మాట్లాడుకుంటున్నారు. జై సింహా చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు లేకపోవడంతో ఫాన్స్‌ కూడా ఈ చిత్రం పట్ల ఎక్కువ ఇదిగా లేరు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని విస్మరించరాదు. జై సింహా అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ సినిమా. సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలు ఎంత బాగా ఆడాయో అదే రీతిన మాస్‌ సినిమాలు కూడా దుమ్ము దులిపాయి.

అజ్ఞాతవాసి చిత్రంలో క్లాస్‌ కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అదే సమయంలో జై సింహా మాత్రం ఊర మాస్‌గా బి, సి ఆడియన్స్‌ని మాత్రమే దృష్టిలో వుంచుకున్నట్టుంది. ఒకవేళ అజ్ఞాతవాసి కనుక మాస్‌ని ఆకట్టుకోవడంలో విఫలమై, జై సింహా గర్జనలు వారికి బాగా నచ్చితే ఈ చిత్రానికి వుండే రెవెన్యూ దీనికి వుంటుంది. బాలకృష్ణ సినిమాలని ప్రిడిక్ట్‌ చేయడం చాలా కష్టం. విడుదలకి ముందు ఎలాంటి అంచనాలు లేని సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు చేసిన హిస్టరీ వుంది.

ఫక్తు మాస్‌ సినిమాని విడుదలకి ముందే జడ్జి చేయడం ఎవరి తరం కాదు. కనుక జై సింహా చిత్రాన్ని తేలికగా తీసుకుంటోన్న కాంపిటీటర్లు కానీ, ట్రోల్‌ చేస్తోన్న సోషల్‌ మీడియా వర్గాలు కానీ పండగ అయ్యే వరకు, ఆ చిత్రం ఫలితం తేలే వరకు పండగ చేసుకోకుండా వుంటే బెటరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు