క్లాష్‌ల్లో నలిగిపోతున్న సినిమాలు

క్లాష్‌ల్లో నలిగిపోతున్న సినిమాలు

హీరోలు ఎక్కువైపోవడంతో ఇప్పుడు సినిమాల సంఖ్య పెరిగిపోయింది. గతంలో ఏ పండగ సీజన్‌కి అయినా, హాలిడే పీరియడ్‌కి అయినా ఎక్కువ సినిమాలు పోటీ పడేవి కావు. కానీ ఇప్పుడు వారాంతంలో ఒక రోజు ఎక్స్‌ట్రా హాలిడే వుందంటే చాలు చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. సంక్రాంతి, దసరా లాంటి పండగలకి ఎక్కువ సినిమాలు వచ్చినా అంత నష్టం లేదు కానీ మిగతా సమయాల్లో ఎక్కువ సినిమాలు వస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి నష్టపోక తప్పదు.

ఆగస్టు 15 వీకెండ్‌కి నేనే రాజు నేనే మంత్రి, లై, జయ జానకి నాయక చిత్రాలు విడుదల కాగా, నేనే రాజు ఒక్కటే విజయవంతమైంది. మంచి టాక్‌ వచ్చినా కానీ జయ జానకి నాయక ఫ్లాప్‌ అయింది. వసూళ్లు సరిపడా రాకపోవడం వల్ల జయ జానకి నాయక రికవర్‌ కాలేకపోయింది. లై కూడా అంత డిజాస్టర్‌ అవ్వాల్సినది కాదు కానీ అన్ని సినిమాల మధ్య పోటీలో ఈ క్లాస్‌ సినిమా పూర్తిగా నలిగిపోయింది. ఇప్పుడు హలో సినిమాకి కూడా ఎంసిఏ సెగ తగిలేస్తోంది. మాస్‌ అప్పీల్‌ మెండుగా వున్న నాని సినిమా ముందు ఈ క్లాస్‌ సినిమా నిలబడలేకపోతోంది. విక్రమ్‌ కుమార్‌ మంచి దర్శకుడే అయినా కానీ మాస్‌ అప్పీల్‌ లేకపోవడంతో హలో చిత్రానికి ఆశించిన వసూళ్లు రావడం లేదు.

టాక్‌ బాలేకపోయినా ఎంసిఏ డామినేట్‌ చేసేస్తోంది. ఇలాంటి క్లాష్‌లకి కనీసం క్లాస్‌ సినిమాలైనా దూరంగా వుండాలని, సమ్మర్‌లో పెద్ద సినిమాల నడుమ గ్యాప్‌ చూసుకుని రావాలని ట్రేడ్‌ నిపుణులు సూచిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English