అజ్ఞాతవాసికి ఓ అడ్డు తొలగిపోయింది

అజ్ఞాతవాసికి ఓ అడ్డు తొలగిపోయింది

సంక్రాంతికి విడుదల కాబోతున్న అజ్ఞాతవాసి చిత్రానికి పలు సినిమాల నుంచి పోటీ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే జై సింహా, గ్యాంగ్‌ సినిమాలు సంక్రాంతికి ఖరారు కాగా, రవితేజ నటించిన 'టచ్‌ చేసి చూడు' కూడా అప్పుడే రిలీజ్‌ చేయాలని చూసారు. అయితే ఈ చిత్రం పెండింగ్‌ వర్క్‌ చాలా వుందట. మరో పది రోజుల్లోగా అన్ని పనులు పూర్తి చేయడం జరిగే పని కాదు కనుక దీనిని వాయిదా వేసారని, సంక్రాంతి బరిలోంచి రవితేజ తప్పుకున్నాడని సమాచారం.

టచ్‌ చేసి చూడు సినిమా తప్పుకున్నా కానీ రాజ్‌ తరుణ్‌ నటించిన రంగులరాట్నం మాత్రం సంక్రాంతికి రావచ్చునని అంటున్నారు. రవితేజతో పోలిస్తే రాజ్‌ తరుణ్‌ సినిమా వల్ల పవన్‌ సినిమాకి అంతగా నష్టం వుండదు. రవితేజ చిత్రానికి ఇవ్వాల్సినన్ని థియేటర్లు రాజ్‌ తరుణ్‌కి ఇవ్వాల్సిన పని వుండదు. అలాగే రవితేజ మాదిరిగా అతని సినిమాలకి మాస్‌ ప్రేక్షకాదరణ భారీ స్థాయిలో వుండదు.

టచ్‌ చేసి చూడు సంక్రాంతికి మిస్‌ అవడం అజ్ఞాతవాసికి ఇంకాస్త కలిసొచ్చే అంశమే. ఇకపోతే రవితేజ చిత్రాన్ని సంక్రాంతి నుంచి తప్పించి ఎప్పటికి విడుదల చేయాలని చూస్తున్నారనేది ఇంకా క్లియర్‌గా తెలియలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు