మహేష్‌బాబుపై మూకుమ్మడి దాడి

మహేష్‌బాబుపై మూకుమ్మడి దాడి

మహేష్‌బాబు సినిమా వస్తుందంటే దానికి దూరంగా వెళ్లడానికి, దానితో పోటీ పడకుండా సేఫ్టీ చూసుకోవడానికి ఎవరూ చూడడం లేదెందుకనో. మహేష్‌ 1 సినిమా కోసం వందల కొద్దీ థియేటర్లు ముందే బుక్‌ చేసి పారేసినా కానీ సంక్రాంతికి తమ సినిమాను కూడా విడుదల చేస్తామంటూ చాలా మంది సందడి చేస్తున్నారు. ముఖ్యంగా మెగా హీరోలైతే మహేష్‌ సినిమాని రౌండప్‌ చేసేస్తున్నారు. ఇప్పటికే 'ఎవడు' సంక్రాంతికే విడుదల అవుతుందనే సంకేతాలు బలంగా అందుతున్నాయి. చరణ్‌ సినిమా వస్తుంది కదా అని సాయి ధర్మతేజ తగ్గట్లేదు. తన తొలి సినిమా 'రేయ్‌'కి సంక్రాంతి ముహూర్తమే బెస్ట్‌ అని వైవిఎస్‌ చౌదరి చెప్పడంతో ధర్మతేజ దానికి ఫిక్స్‌ అయ్యాడు.

ఇప్పుడు కొత్తగా అల్లు శిరీష్‌ కూడా సంక్రాంతి పండక్కి తన సినిమా విడుదలైతే కలెక్షన్స్‌ ఎలా ఉంటాయో చూసుకోవాలని అనుకుంటున్నాడు. అతని రెండో సినిమా కొత్తజంట ఆల్రెడీ పూర్తి కావచ్చింది. మారుతి డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలుస్తుందని అంటున్నారు. చివరకు అప్పుడు రిలీజ్‌ అయ్యేవి ఎన్ని, అవి ఏమిటనేది తెలీదు కానీ ప్రస్తుతానికి మాత్రం మహేష్‌ కోసం మెగా ఫీల్డ్‌ సెట్‌ చేసి పెట్టారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English