ఆ రెండిటితోనే బన్నీ సినిమాకు 25 కోట్లు

ఆ రెండిటితోనే బన్నీ సినిమాకు 25 కోట్లు

గత కొన్నేళ్లలో ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు అల్లు అర్జున్. అతడి మార్కెట్ అనూహ్య రీతిలో విస్తరించింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న అతడి సినిమాలు కూడా భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. ‘సన్నాఫ్ సత్యమూర్తి’.. ‘సరైనోడు’.. ‘దువ్వాడ జగన్నాథం’.. ఈ మూడూ కూడా డివైడ్ టాక్ తెచ్చుకున్నవే. కానీ ఈ మూడూ అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టాయి. దీంతో బన్నీ బాక్సాఫీస్ స్టామినా ఏంటో అందరికీ అర్థమైంది. సినిమా సినిమాకూ బడ్జెట్లు పెరుగుతున్నాయి. బిజినెస్ పెరుగుతోంది. అతడి శాటిలైట్ మార్కెట్ కూడా బాగా విస్తరిస్తోంది. బన్నీ కొత్త సినిమా ‘నా పేరు సూర్య’ శాటిలైట్, డిజిటల్ హక్కులు ఏకంగా రూ.25 కోట్లు పలికినట్లు సమాచారం.

ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌కు, ఓ డిజిటల్ మూవీ ఫ్లాట్‌ ఫాంకు హక్కులు అమ్మేస్తూ ఇప్పటికే డీల్ పూర్తయినట్లు సమాచారం. ఇంకా ‘నా పేరు సూర్య’ డబ్బింగ్ హక్కులు సైతం మంచి రేటు పలికే అవకాశముంది. బన్నీ సినిమాల్ని హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేస్తుంటే ఈ మధ్య అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి. ‘సరైనోడు’.. ‘దువ్వాడ జగన్నాథం’ హిందీ వెర్షన్లు యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ‘సరైనోడు’ హిందీ వెర్ష‌న్‌ను ఛానెల్లో ప్రిమియర్ షోగా వేస్తే అందులోనూ రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ నేపథ్యంలో ‘నా పేరు సూర్య’ హిందీ డబ్బింగ్ హక్కులకు మంచి రేటు దక్కే అవకాశముంది. మరోవైపు ‘నా పేరు సూర్య’ థియేట్రికల్ హక్కులకు కూడా అన్ని ఏరియాల్లోనూ బన్నీ కెరీర్లోనే హైయెస్ట్ రేట్లు పలుకుతున్నట్లు సమాచారం. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ నెలాఖర్లో లేదా మే మొదటి వారంలో విడుదలయ్యే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు