ఉన్నవాళ్లు సరిపోరని.. నాని కూడా వస్తాడట

ఉన్నవాళ్లు సరిపోరని.. నాని కూడా వస్తాడట

ఈసారి వేసవికి ఎన్నడూ లేనంత పోటీ ఉండబోతోంది. బడా బడా స్టార్లందరూ వేసవి బరిలో నిలవబోతున్నారు. ముఖ్యంగా ఏప్రిల్లో పోటీ తీవ్రంగా ఉండబోతోంది. వచ్చే ఏడాదికి మోస్ట్ అవైటెడ్ మూవీ అనదగ్గ ‘2.0’ సినిమా ఏప్రిల్ 13న కానీ.. 27న కానీ విడుదలయ్యేలా ఉంది. మరోవైపు మహేష్ బాబు సినిమా ‘భరత్ అను నేను’.. అల్లు అర్జున్ మూవీ ‘నా పేరు సూర్య’ ప్రస్తుతానికి ఏప్రిల్ 27కు ఫిక్సయి ఉన్నాయి. వీటి డేట్లు మారే అవకాశముంది కానీ.. కొంచెం అటు ఇటుగా ఏప్రిల్లోనే వచ్చే అవకాశముంది. ఈ రెండు సినిమాలు కాక అక్కినేని నాగార్జున-రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాను ఏప్రిల్ 20కి ఫిక్స్ చేశారు. మరోవైపు రామ్ చరణ్ సినిమా ‘రంగస్థలం’ మార్చి 30కి ఫిక్సయింది. అది ఏప్రిల్ మొదటి వారంలో సందడి చేస్తుంటుంది.

ఇంతమంది ఏప్రిల్ మీద కన్నేసి ఉండగా.. నేచురల్ స్టార్ నాని కూడా ఏప్రిల్ మీదే కన్నేశాడన్న సమాచారం బయటికి వచ్చింది. ఇటీవలే ‘ఎంసీఏ’తో పలకరించిన నాని.. దీని తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుందట. ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల్ని హోల్ సేల్‌గా కొనేసిన దిల్ రాజు.. ఏప్రిల్ 9న డేట్ బుక్ చేసి బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు కూడా సమాచారం ఇచ్చేశాడట. మరి ఇంత మంది స్టార్ల మధ్య నాని కూడా పోటీకి దిగడం ఆసక్తి రేకెత్తించేదే. ఈ చిత్రంలో నాని సరసన అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ కథానాయికలుగా నటిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English