నాని.. ఇట్స్ హై టైం అమ్మా!

నాని.. ఇట్స్ హై టైం అమ్మా!

ఆడుతున్నాయి కదా అని మళ్లీ మళ్లీ ఒకే తరహా సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో గతంలో చాలా రుజువులున్నాయి. శ్రీను వైట్ల లాంటి దర్శకులు ఇలా ఒకే ఫార్మాట్లో సినిమాలు తీసే అడ్రస్ లేకుండా పోయారు. దర్శకులైనా, హీరోలైనా ఈ విషయాన్ని గుర్తెరిగి నడుచుకోవాల్సిందే. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని ఈ విషయంలో కచ్చితంగా అప్రమత్తం కావాల్సిందే. అతను గత రెండు మూడేళ్లలో చేసిన కొన్ని రొటీన్ సినిమాలు కూడా ఎలాగోలా ఆడేశాయి. నిజానికి ‘మజ్ను’ ఫ్లాప్ కావాల్సిన సినిమా. నాని చేసిన మాయతో ఏదో అలా ఆడేసింది. ‘నేను లోకల్’ వాస్తవానికి అంత పెద్ద హిట్టవ్వాల్సిన సినిమా కాదు. కానీ అదీ ఇరగాడేసింది. ఇప్పుడు ‘ఎంసీఏ’ సినిమాకు కూడా కళ్లు చెదిరే ఓపెనింగ్స్ వచ్చాయి.

ఐతే నాని సూపర్ ఫామ్‌లో ఉండటం.. చాన్నాళ్లుగా సరైన సినిమా లేక ప్రేక్షకులు నైరాశ్యంలో ఉన్న స్థితిలో ‘ఎంసీఏ’ రిలీజ్ కావడం.. పైగా పెద్ద ఎత్తున రిలీజ్ చేయడం.. ఇలా అనేక అంశాలు కలిసొచ్చి ‘ఎంసీఏ’కు ఓపెనింగ్స్ వచ్చాయి తప్ప.. సినిమా చాలా బాగుండి ఏమీ కాదు. వీకెండ్ తర్వాత చూస్తే ఈ సినిమా అసలు రంగు తేలిపోతుంది. ఐతే ఆ లోపే చాలా వరకు పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుంది కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావడానికి అవకాశాలున్నాయి.

అలా జరిగినంత మాత్రాన ‘ఎంసీఏ’ హిట్ సంబరపడిపోయి.. నాని మళ్లీ ఇలాంటి ఓ సినిమా ట్రై చేస్తే బొక్క బోర్లా పడటం ఖాయం. జనాలు నానిని ఈసారికి నానిని క్షమించేశారేమో కానీ.. ఇంకోసారి అతను ఇలాంటి సినిమా చేస్తే కష్టమే. ఇట్స్ హై టైమ్ అంటుంటారు కదా. అలాంటి పరిస్థితే ఉందిప్పుడు. ఈ విషయం గుర్తించి నాని ఇక భిన్నమైన పాత్రల వైపు అడుగులేస్తే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English