టైగర్ దంచుతున్నాడు హై

టైగర్ దంచుతున్నాడు హై

కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్లీ బాక్సాఫీస్ మీదికి దాడికి వచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. క్రిస్మస్ కానుకగా శుక్రవారం రిలీజైన అతడి కొత్త సినిమా ‘టైగర్ జిందా హై’కి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. సమీక్షకులు ఈ చిత్రానికి చాలా మంచి రేటింగ్స్ ఇచ్చారు. ప్రముఖ క్రిటిక్ కమ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఏకంగా 4.5 స్టార్ రేటింగ్ ఇవ్వడం విశేషం. కొంచెం క్రిటికల్‌గా రివ్యూలు రాసే రైటర్లు కూడా ఈ సినిమా గురించి పాజిటివ్‌గానే స్పందించారు. చిత్రం విమర్శకుల్ని మెప్పిస్తూనే.. కమర్షియల్‌గా కూడా పెద్ద సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సల్మాన్ ఫ్యాన్స్ సినిమా చూసి వెర్రెత్తిపోతున్నారు.

నాన్ హాలిడే.. నాన్ వీకెండ్ డేలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘టైగర్ జిందా హై’ రికార్డు నెలకొల్పినట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. ఈ చిత్రం తొలి రోజు రూ.34 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. సల్మాన్ గత చిత్రం ‘ట్యూబ్ లైట్’పై భారీ అంచనాలున్నప్పటికీ తొలి రోజు రూ.21 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. ‘టైగర్ జిందా హై’ దాంతో పోలిస్తే 60 శాతం అధిక వసూళ్లు సాధించింది. ఈ ఏడాది ‘బాహుబలి’ కాకుండా తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా కూడా ఇదే. టాక్ పాజిటివ్‌గా ఉండటం.. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీతో ‘టైగర్ జిందా హై’ వసూళ్లు భారీ స్థాయిలో ఉంటాయని భావిస్తున్నారు. తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘భజరంగి భాయిజాన్’ వసూళ్లను సల్మాన్ ‘టైగర్ జిందా హై’తో దాటేస్తాడని అంచనా వేస్తున్నారు. ‘భజరంగి..’ రూ.626 కోట్లు వసూలు చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English