బన్నీ చెప్పబోయే సీక్రెట్ ఏంటబ్బా..?

బన్నీ చెప్పబోయే సీక్రెట్ ఏంటబ్బా..?

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా ‘నా పేరు సూర్య’. ఈ సినిమా ఆరంభమయ్యే ముందే టైటిల్ లోగో లాంచ్ చేశారు. ఆ తర్వాత ఇప్పటిదాకా ఈ చిత్రానికి సంబంధించి ఏ విశేషం బయటికి రాలేదు. ఏప్రిల్లో ఈ చిత్రం విడుదల చేయాలని డిసైడైన నేపథ్యంలో ఇక నెమ్మదిగా ప్రమోషన్లు మొదలుపెట్టాల్సిందే. ఆ పనిలోనే పడ్డట్లుంది చిత్ర బృందం. ‘నా పేరు సూర్య’కు సంబంధించి ఈ రోజు రాత్రి పదిన్నర గంటలకు ఒక సీక్రెట్ ఏదో బయట పెడతామంటూ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది చిత్ర బృందం. బహుశా ‘నా పేరు సూర్య’ ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజవుతుందో రాత్రికి ప్రకటిస్తారని భావిస్తున్నారు.

నూతన సంవత్సర కానుకగా డిసెంబరు 31న రాత్రి ‘నా పేరు సూర్య’ ఫస్ట్ లుక్ లాంచ్ చేయొచ్చని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. దానికి సంబంధించిన సమాచారమే ఇప్పుడు పంచుకునే అవకాశముంది. రచయితగా స్టార్ స్టేటస్ సంపాదించిన వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం కాబోతున్న చిత్రం ‘నా పేరు సూర్య’. అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యుయెల్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్, నాగబాబు కలిసి నిర్మిస్తున్నారు. బన్నీ ఇందులో సైనికుడి పాత్రలో కనిపిస్తాడని.. సినిమా చాలా సీరియస్‌గా, ఇంటెన్స్‌గా సాగుతుందని అంటున్నారు. రచయితగా వక్కంతం పని చేసిన సినిమాల్లో హీరో పాత్ర చాలా టిపికల్‌గా ఉంటుంది. ‘నా పేరు సూర్య’లోనూ హీరో పాత్రను అలాగే తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు