బాక్సింగ్ కు బన్నీ రెడీ

బాక్సింగ్ కు బన్నీ రెడీ

చూస్తుంటే స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టయిల్ మార్చినట్టే కనిపిస్తున్నాడు.  ఇంతవరకు బన్నీ ఆల్రెడీ ఫాంలో ఉన్న డైరెక్టర్లతోనే వరసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. అతడు చేసిన చివరి రెండు సినిమాలు సరైనోడు - దువ్వాడ జగన్నాథమ్ రెండూ స్టోరీ పరంగా చూసుకుంటే పాత చింతకాయ పచ్చడిలానే ఉండటం నోట్ చేయాల్సిన పాయింట్. ముఖ్యంగా దువ్వాడ జగన్నాథమ్ సినిమాకు వచ్చేసరికి కథ విషయంలోనే చాలా విమర్శలొచ్చేశాయి.

ఈ టైంలో అల్లు అర్జున్ చాలా కాలం తరవాత కొత్త డైరెక్టర్ కు ఛాన్సిచ్చాడు.  టెంపర్ లాంటి సూపర్ హిట్ సినిమాకు స్టోరీ అందించిన రైటర్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో నా పేరు సూర్య సినిమా చేస్తున్నాడు. దీని తరవాత స్పోర్ట్స్ డ్రామా బేస్ గా తెరకెక్కే సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. కొత్త డైరెక్టర్ అను రెడ్డి సిద్ధం చేసిన స్క్రిప్ట్ చదివి ఈ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. ఇందులో అల్లు అర్జున్ బాక్సింగ్ క్రీడకు హార్డ్ కోర్ ఫ్యాన్ గా కనిపించబోతున్నాడు. ఈ స్క్రిప్ట్ కు బన్నీ ఎంత ఇంప్రెస్ అయ్యాడంటే ఈ మూవీని సొంతంగా ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. అల్లు అర్జున్ తండ్రి అరవింద్ కు గీతా ఆర్ట్స్ బ్యానర్ ఉన్నప్పటికీ దానితో సంబంధం లేకుండా సొంత బ్యానర్ లోనే సినిమా తీయాలని భావిస్తున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం వక్కంతం వంశీ తీస్తున్న నా పేరు సూర్య షూటింగ్ పనుల్లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పనులు పూర్తయిన తరవాత అనురెడ్డి సినిమాపై దృష్టి పెట్టనున్నాడు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ప్రారంభం కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు