పెళ్లి చూపులు డైరెక్టర్ లాంగ్ జర్నీ

పెళ్లి చూపులు డైరెక్టర్ లాంగ్ జర్నీ

ఎలాంటి ఇమేజ్ లేని నటులతో.. ఎటువంటి హైప్ లేకుండా ఒక ఫ్రెష్ లుక్ తో వచ్చి సైలెంట్ హిట్ కొట్టింది పెళ్లిచూపులు. లాస్ట్ ఇయర్ ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దీంతో ఈ మూవీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వ ప్రతిభకు ప్రశంసలు వచ్చాయి. పెళ్లి చూపులు తరవాత సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమా చేసేందుకు తరుణ్ భాస్కర్ రెడీ అవుతున్నాడు.

తన నెక్ట్స్ సినిమా తరుణ్ భాస్కర్ అందరూ కొత్త నటులతో తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. ఈ మూవీ ఓ లాంగ్ జర్నీ నేపథ్యంగా సాగే రొమాంటిక్ మూవీగా ఉంటుందని తెలుస్తోంది. కొంతమంది స్నేహితులు కలిసి ఓ దూరప్రాంతానికి వెళ్లి సాగించే ప్రయాణంలో తమను తాము తెలుసుకోవడమన్నదే ఈ తరహా సినిమాల మెయిన్ కాన్సెప్ట్ గా ఉంటుంది. బాలీవుడ్ లో అయితే ఇది సూపర్ హిట్ ఫార్ములా. దిల్ చాహ్ తా హై నుంచి జిందగీ నా మిలేగీ దోబారా వరకు ఫీల్ గుడ్ తరహాలో వచ్చిన సినిమాలన్నీ కమర్షియల్ గా హిట్ సాధించాయి. కాకుంటే ఈ తరహా సినిమాలు టాలీవుడ్ లో హిట్ కొట్టింది తక్కువే. అప్పట్లో వచ్చిన గమ్యం మినహా ఈ జోనర్ లో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. లేటెస్ట్ గా నాగచైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో కూడా నిర్మాతలకు నిరాశే మిగిల్చింది.

ఏదో పాయింట్ అనుకుని షూటింగ్ స్టార్ట్ చేసే తీరులో కాకుండా ఈ సినిమా కోసం తరుణ్ భాస్కర్ పది నెలలుగా స్క్రిప్ట్ వర్క్ చేశాడు. సబ్జెక్టుపై కాన్ఫిడెన్స్ వచ్చాకే షూటింగ్ కు రెడీ అవుతున్నాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. తనకు అలవాటైన పెళ్లి చూపులు సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీంనే ఈ సినిమాకు కూడా తీసుకోవాలని అనుకుంటున్నాడు. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు