మెగా ఫ్యాన్స్ కి ఒక్క క్షణం బిస్కెట్

మెగా ఫ్యాన్స్ కి ఒక్క క్షణం బిస్కెట్

ఫ్యామిలీలో యాక్టర్స్  అందరినీ కలిపితే.. ఓ క్రికెట్ టీం అయిపోతారు. ఇది ఓ మెగా హీరో చెప్పిన మాట. ఇందులో ఎలాంటి అవాస్తవం లేదు. అయితే.. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు అందరికీ ఒకే రకమైన సపోర్ట్ లభిస్తుందని అనుకోవడం సరి కాదు. పవర్ స్టార్ నుంచి అల్లు శిరీష్ వరకూ అనేక మంది ఇండస్ట్రీలోకి వస్తే.. ఎవరి రేంజ్ వారికి ఏర్పడింది.

వీరిలో అల్లు శిరీష్ ఎక్కువగా తిప్పలు పడాల్సి వచ్చింది. సినిమాలు ఫెయిల్ అవడం పక్కన పెడితే.. విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిన ఏకైక హీరో శిరీష్. అయితే.. గతేడాది శ్రీరస్తు శుభమస్తు సక్సెస్ సాధించి.. గాడిన పడ్డాడనే చెప్పాలి. మెగా ఫ్యాన్స్ నుంచి ఇప్పటివరకూ అల్లు శిరీష్ కు ఫుల్ సపోర్ట్ అందడం లేదు. అందుకే ఈ సారి మెగా ఫ్యాన్స్ ను బుట్టలో వేసుకునేందుకు మంచి ఐడియానే వేసినట్లుగా ఉంది ఒక్క క్షణం టీం. ఇవాళ జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. మెగాభిమానుల చేతుల మీదుగా ట్రైలర్ లాంఛ్ చేయిస్తారట.

ఇలా అభిమానులతో ట్రైలర్ లాంఛ్ చేయడం కొత్త ఆలోచనే అయినా.. ఇందులో మెగా ఫ్యాన్స్ ను ఆకర్షించాలనే పాయింటే ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు. మరి ఈ మెగా బిస్కెట్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చెప్పలేం కానీ.. ఒక్క క్షణం మూవీ మాత్రం టీజర్ తో బాగానే ఆకట్టుకుంది. ట్రైలర్ కూడా ఇదే స్థాయిలో ఉంటే.. మెగా ఫ్యాన్స్ అండ లభిస్తే.. వసూళ్లు అదిరిపోవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు