శ్రీదేవికి ఫ్లాపిచ్చాడు.. సల్మాన్ కు??

శ్రీదేవికి ఫ్లాపిచ్చాడు.. సల్మాన్ కు??

కోన వెంకట్ అంటే మనకు ఒకప్పటి స్టార్ రైటర్. తన రచనకు భారీ మొత్తంలోనే  అందుకున్న ఈ రైటర్.. ఇప్పుడు ఆ రేంజ్ ను దాదాపుగా కోల్పోయాడు. సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా కొనసాగుతున్నాడు. అయితే బాలీవుడ్ లో మాత్రం రైటర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు కోన వెంకట్.

ఇంగ్లీష్ వింగ్లిష్ అంటూ గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన మాజీ అందాల తార శ్రీదేవికి ఓ కథ చెప్పి ఒప్పించి సినిమా చేశాడు కోన. మామ్ అంటూ ఈ ఏడాది ప్రథమార్ధంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డింకీ కొట్టేసింది. అయినాసరే ఇప్పుడు మరో భారీ చిత్రాన్ని పట్టేశాడు కోన వెంకట్. టైగర్ జిందా హై అంటూ ఆడియన్స్ ముందుకు వస్తున్న సల్మాన్ ఖాన్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ లో ఒకదాన్ని ఒడిసిపట్టాడు కోన వెంకట్. షేర్ ఖాన్ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి.. సల్మాన్ ఖాన్ సోదరుడు  సోహైల్ దర్శకత్వం వహించనున్నాడు. టాలీవుడ్ రీమేక్స్ తోను.. కథలతోను హిట్స్ అందుకున్న సల్మాన్.. మళ్లీ తెలుగు రైటర్ పై విశ్వాసం ఉంచాడు.

అయితే.. భజరంగీ భాయ్ జాన్ వంటి భారీ సక్సెస్ సాధించే కథను ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్ కు కాకుండా.. ఫ్లాప్ మూవీకి స్టోరీ ఇచ్చిన కోన వెంకట్ కు సల్మాన్ ఛాన్స్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయమే. సల్మాన్ ఏమీ అంత సులువుగా ఒప్పుకోలేదని.. కోన కథకు.. తనదైన మెరుగులు అన్నీ దిద్దించి రెడీ చేసుకున్న తర్వాతే ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ చేశాడని టాక్ వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English