జగపతికి పోటీగా కోటి రూపాయల ఆర్టిస్ట్

జగపతికి పోటీగా కోటి రూపాయల ఆర్టిస్ట్

టాలీవుడ్ లోకి తమిళ హీరోలు విలన్స్ గా ఎంట్రీ ఇవ్వడం ఎక్కువవుతోంది. ధృవతో అరవింద్ స్వామి.. లై మూవీతో అర్జున్.. ఇప్పుడు సవ్యసాచితో మాధవన్.. తెలుగు తెరపై విలన్స్ గా మారిపోతున్నారు. హీరోలుగా బోలెడంత ఇమేజ్ ఉన్న వీరిని.. భారీ మొత్తమే ముట్టచెప్పి మరీ విలన్స్ గా మారుస్తున్నారు మన టాలీవుడ్ మేకర్స్.

అయితే.. ఇది మనోళ్లకు మాత్రమే పరిమితం కాదు. జగపతి బాబు కూడా ఇలాంటి ట్రెండ్ లోనే ఉన్నాడు. అసలు ఈ ట్రెండ్ మొదలైనదే జేబీతో అని చెప్పచ్చు. మలయాళ.. తమిళ రంగాల్లో స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా యాక్ట్ చేసేసి.. భారీ మొత్తాన్ని అందుకుంటున్నాడు జగపతి బాబు. అయితే.. అటు ఇమేజ్.. ఇటు యాక్టింగ్ స్కిల్స్ ఉండి.. అందరికీ తెలిసిన నేటివ్ పర్సన్ కావడంతో మొదట జగపతికి ఎలాంటి పోటీ లేకపోయింది. ఇప్పుడు మాధవన్ ను కూడా విలన్ గా మార్చేస్తోంది టాలీవుడ్. నేరుగా తెలుగు సినిమాలు చేయకపోయినా.. టాలీవుడ్ లో ఇతడికి చాలానే ఇమేజ్ ఉంది.

సఖి చిత్రం అందించిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఎటొచ్చీ అరవింద్ స్వామికి విలన్ గా కంటిన్యూ అయే ఉద్దేశ్యం లేదని చెప్పేశాడు. కానీ మాధవన్ అలాంటి ప్రకటనలు ఏమీ చేయలేదు. దీంతో జగపతికి పోటీగా నిలిచేందుకు మాధవన్ రెడీ అవుతున్నడానే టాక్ వినిపిస్తోంది. పైగా ఒక్కో మూవీకి మినిమం కోటి రూపాయల పారితోషికం గిడుతున్నపుడు హీరో పాత్ర అయితే ఏంటి.. విలన్ పాత్ర అయితే ఏంటి.. అంతే కదా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు