ఒకరి బాకా ఒకరు ఊదేసుకున్నారు

ఒకరి బాకా ఒకరు ఊదేసుకున్నారు

హీరోలు, హీరోయిన్లు తమ తోటి వారిని పొగడ్డం చాలా అరుదుగా జరుగుతుంది. అందులోను ఇద్దరూ స్టార్‌ హీరోయిన్లయితే కనుక ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు. కానీ టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పడుకొనే మాత్రం ఒకరి బాకా ఒకరు ఊదేసుకున్నారు. బహుశా ఇద్దరూ వేర్వేరు భాషల్లో పాపులర్‌ కాబట్టి ఒకర్ని ఒకరు పొగుడుకోవడానికి జంకలేదేమో. ఇలాగే తమ తోటి హీరోయిన్ల గురించి ఇద్దరూ మాట్లాడడం అయితే గతంలో జరగలేదు.

దీపికా పడుకొనే గురించి సమంత చాలా గొప్పగా ట్వీట్‌ చేసింది. సడన్‌గా ఆమె గురించి ఎందుకు పొగిడింది అనేది కూడా సమంత ప్రత్యేకంగా చెప్పలేదు. సమంత పొగడ్తకి రెస్పాండ్‌ అవుతూ నీ అంతటి హీరోయిన్‌ నుంచి ప్రశంసలు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని దీపిక పేర్కొంది. రేపు సమంత బాలీవుడ్‌కి వెళ్లినా, లేదా దీపికే టాలీవుడ్‌లో సినిమాలు చేసినా ఇద్దరూ ఒకరిపై ఒకరు ఇదే రీతిన అభిమానం చూపుతారో లేదో కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ ఇద్దరు అందగత్తెలు ఇలా పరస్పర ప్రశంసలు కురిపించుకుంటూ ఉంటే చూడ్డానికి చాలా బాగా అనిపించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు