సన్నీని హర్ట్ చేసేసినారబ్బా

సన్నీని హర్ట్ చేసేసినారబ్బా

పోర్న్ స్టార్‌గా తన కెరీర్‌కు సన్నీ లియోన్ గుడ్ బై చెప్పేసి దశాబ్దం అవుతోంది. ఏడెనిమిదేళ్ల కిందటే ఇండియాకు వచ్చేసి ఇక్కడ సినిమాలు.. స్పెషల్ షోలు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది సన్నీ. ముందు ఆమెను మన జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సందేహించారు కానీ.. ఆ సందేహాలన్నీ పటాపంచలు చేస్తూ సన్నీ ఇక్కడ స్వేచ్ఛగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరిగేసింది.

ఈ మధ్య కేరళలో ఒక వాణిజ్య కార్యక్రమం కోసం వెళ్తే ఒక పెద్ద రోడ్డు రోడ్డంతా జనాలతో నిండిపోయి ట్రాఫిక్ జాం అయిపోయిన పరిస్థితి. ఆ ఆదరణ చూసి ఉబ్బితబ్బిబ్బయిపోయి తనపై కురిపిస్తున్న అభిమానం గురించి ట్విట్టర్లో గొప్పగా చెప్పుకుంది సన్నీ.

అలాంటమ్మాయిని ఇప్పుడు బెంగళూరు జనాలు హర్ట్ చేసేశారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బెంగళూరులో 31న రాత్రి సన్నీ స్పెషల్ ప్రోగ్రాం ఇవ్వాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసం భారీగా సన్నాహాలు చేస్తుండగా.. ఆమె ఇక్కడ డ్యాన్స్ చేయడానికి వీల్లేదంటూ ఓ సంస్థ ఆందోళన మొదలుపెట్టింది. సన్నీ చీరతో సంప్రదాయబద్ధంగా రావాలని.. అలా కాని పక్షంలో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధమని ఆ సంస్థ ప్రతినిధులు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు.

ఈ విషయమై కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతుండటంతో.. సన్నీకి విషయం తెలిసింది. ఇది తనకు ఆందోళన కలిగించిందని.. తనకు జనాల భద్రతే ముఖ్యమని.. కాబట్టి తాను ఆ కార్యక్రమంలో పాల్గొనడం లేదని సన్నీ ట్విట్టర్ ద్వారా స్టేట్మెంట్ ఇచ్చింది. సన్నీ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిశాయి. అదే సమయంలో బెంగళూరు జనాల్ని తిట్టిపోస్తూ.. ఈ విషయంలో ఏమీ చేయలేకపోయిన అక్కడి పోలీసుల తీరును కూడా నెటిజన్లు తప్పుబట్టారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు