తమ్ముడి డైరెక్టర్‌కి బన్నీ అభయం

తమ్ముడి డైరెక్టర్‌కి బన్నీ అభయం

అల్లు శిరీష్‌తో 'ఒక్క క్షణం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వై ఆనంద్‌ ప్రతిభకి అల్లు అర్జున్‌ ముగ్ధుడయ్యాడట. ఒక్క క్షణం చిత్రాన్ని వీక్షించిన అల్లు అర్జున్‌ అతని క్రియేటివిటీకి ఫ్లాట్‌ అయిపోయాడట. ఇంతకుముందు 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రం చూసినపుడే ఆనంద్‌కి అల్లు అర్జున్‌ ప్రశంసలు అందించాడు. తాజాగా తమ్ముడితో తీసిన సినిమా చూసి ఇతనిలో చాలా ప్రతిభ వుందని గుర్తించాడు.

అందుకే తనకోసం ఒక కథ రెడీ చేయమని ఆనంద్‌కి చెప్పాడట. తన ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకోకుండా భారీ స్కేల్‌లో తీసే కథ రెడీ చేయమని చెప్పాడట. తనకి కనుక కథ నచ్చినట్టయితే వెంటనే షూటింగ్‌కి వెళ్లిపోదామని హామీ ఇచ్చాడట. అల్లు అర్జున్‌ ఆ మాట అనడంతో ఆనంద్‌ అతనికోసం కథ రాసే పనిలో పడ్డాడట. ఈమధ్య అల్లు అర్జున్‌ తన శైలి పూర్తిగా మార్చేసాడు.

ఇంతకుముందు అగ్ర దర్శకులతో పని చేయడానికి ఆసక్తి చూపించిన అల్లు అర్జున్‌ ఇప్పుడు యువ దర్శకులని ఎంకరేజ్‌ చేస్తున్నాడు. సరికొత్త కథలు కావాలని అడుగుతున్నాడే కానీ రొటీన్‌ కథలు వద్దని అనేస్తున్నాడు. ప్లానింగ్‌ విషయంలో అల్లు అర్జున్‌ ఎప్పుడూ మిగతా వారి కంటే ముందుంటాడు కనుక ఈ ట్రెండులోకి మిగతా వారు కూడా మారినా ఆశ్చర్యం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు