రామ్‌ చరణ్‌ కోసం మెగా ప్యాకేజ్‌

రామ్‌ చరణ్‌ కోసం మెగా ప్యాకేజ్‌

చరణ్‌తో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే చిత్రం ఫిబ్రవరి నుంచే మొదలు కానుంది. ప్రస్తుతం 'రంగస్థలం' ప్యాచ్‌ వర్క్‌ పనులు జరుగుతూ వుండడంతో చరణ్‌ ఆ గెటప్‌ కంటిన్యూ చేస్తున్నాడు. మొత్తం సినిమా లాక్‌ అయిపోయిన తర్వాత చరణ్‌ గెటప్‌ మారుస్తాడట. ఈలోగా బోయపాటి శ్రీను తన సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసేస్తాడట.

పోతే ఈ చిత్రం పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ అని, సుకుమార్‌ సినిమా క్లాస్‌ కనుక దానికి కంటిన్యూషన్‌గా వచ్చే చిత్రం మాస్‌ని అలరించేది అయి వుండాలని దీనిని ఓకే చేసారు. ఈ చిత్రాన్ని కంప్లీట్‌ ప్యాకేజ్‌లా మలిచేందుకు బోయపాటి శ్రీను పేరున్న తారాగణాన్ని సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌కి తీసుకుంటున్నాడు. రమ్యకృష్ణ కీలక పాత్ర చేస్తుందని, విలన్‌గా బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటిస్తాడని సమాచారం.

మరో ఇద్దరు ప్రముఖ నటులు కూడా రెండు కీలక పాత్రల్లో కనిపిస్తారట. దసరాకి విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తోన్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్‌ హంగులు వుండేట్టు చూసుకుంటున్నారు. రంగస్థలం మాస్‌కి చేరువ కాని పక్షంలో చరణ్‌ తన కోర్‌ ఆడియన్స్‌కి దూరం కాకుండా పకడ్బందీగా ఈ చిత్రాన్ని లైన్లో పెట్టారు. దీని తర్వాత ఎలాగో రాజమౌళి మల్టీస్టారర్‌ వుంది కనుక ఇది మినిమం గ్యారెంటీ సినిమాగా మలచాలనేది అసలు ప్లాన్‌ అన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English