చిరుకి నో చెప్పి.. చెర్రీతో చేస్తున్నాడా?

చిరుకి నో చెప్పి.. చెర్రీతో చేస్తున్నాడా?

బాలీవుడ్ యాక్టర్స్ అప్పుడప్పుడు తెలుగులో మెరుస్తూనే ఉంటారు. హీరోయిన్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా టాలీవుడ్ స్క్రీన్ పై సందడి చేస్తుంటారు. విలన్ పాత్రల కోసం అయితే వీరికి చాలానే డిమాండ్ ఉంటుంది. వివేక్ ఒబెరాయ్ కూడా కొన్ని డైరెక్ట్ తెలుగు సినిమాల్లోనే కనిపించాడు.

అయితే.. గతంలో ఖైదీ నంబర్ 150 మూవీలో విలన్ పాత్రకు మొదటగా ఈ బాలీవుడ్ నటుడినే అడిగారనే టాక్ ఉంది. కారణాలు ఏమైనా కానీ.. ఇది సాధ్యపడలేదు. చివరకు ఆ పాత్రను తరుణ్ అరోరాతో చేయించారు. అప్పుడు చిరు సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న వివేక్ ఒబెరాయ్.. ఇప్పుడు రామ్ చరణ్ లేటెస్ట్ మూవీకి మాత్రం సై అన్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రంగస్థలం మూవీలో నటిస్తున్న చెర్రీ.. ఆ తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే మూవీ లాంఛింగ్ జరగగా.. జనవరి చివరి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

బోయపాటి మార్క్ మాస్ సినిమాగానే చెర్రీ మూవీ ఉండనుందట. విలన్ పాత్రకు ఈ చిత్రంలో చాలానే ఇంపార్టెన్స్ ఉంటుందట. అందుకే ఈ పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్ ను సంప్రదించగా.. సై అన్నట్లుగా తెలుస్తోంది. అలాగే.. మరో కీలకమైన పాత్ర కోసం సీనియర్ నటి రమ్యకృష్ణను తీసుకున్నారని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు