అఫీషియల్: భారతీయుడు-2 నుంచి ఆయన ఔట్

అఫీషియల్: భారతీయుడు-2 నుంచి ఆయన ఔట్

స్టార్ హీరోలతో సినిమాలు చేసినా.. చాలా వరకు బడ్జెట్ హద్దుల్లో ఉండేలా చూసుకుంటాడు దిల్ రాజు. బడ్జెట్ విషయంలో ఆయనెప్పుడూ నేల విడిచి సాము చేసింది లేదు. అలాంటి వాడు శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్లో ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్‌తో ‘భారతీయుడు’ సినిమా తీయబోతున్నాడన్న సమాచారం బయటికి రాగానే షాకైపోయారందరూ.

మామూలుగా రాజు ఎంత పెద్ద హీరోతో.. దర్శకుడితో సినిమా చేసినా.. స్క్రిప్టు దగ్గర్నుంచి మేకింగ్ వరకు ఆయన ఇన్వాల్వ్‌మెంట్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో శంకర్, కమల్ హాసన్‌.. రాజుకు అంత స్వేచ్ఛనిస్తారా.. మేకింగ్ దగ్గర వాళ్లకు, దిల్ రాజుకు తేడా కొట్టేయదా అన్న సందేహాలు కూడా నెలకొన్నాయి.

ఈ సందేహాలు ఇలా ఉండగానే.. ఈ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి ముందడుగూ పడకపోవడం.. దసరాకు శంకర్, కమల్ హాసన్‌లను కలిసి వచ్చాక దిల్ రాజు నుంచి ఈ సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ లేకపోవడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారేమో అన్న గుసగుసలు వినిపించాయి. నెమ్మదిగా ఈ సందేహాలు బలపడ్డాయి. ఇప్పుడీ విషయంలో అధికారిక సమాచారం కూడా వచ్చేసింది. భారతీయుడు-2 నుంచి తాను తప్పుకున్నట్లు స్వయంగా దిల్ రాజే అధికారికంగా ప్రకటించేశాడు. ఐతే ఈ సందర్భంగా ఆయన ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు.
కొంతమంది శ్రేయోభిలాషుల సూచన మేరకే తాను ఈ సినిమాకు దూరమైనట్లు దిల్ రాజు చెప్పాడు. ఐతే శంకర్-కమల్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా తమిళంలో మరో నిర్మాతను సెట్ చేసుకోవడం వాళ్లకు పెద్ద కష్టం కాకపోవచ్చేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు