హీరో టర్న్డ్ డైరెక్టర్.. 40 రోజుల్లో ఫినిష్

హీరో టర్న్డ్ డైరెక్టర్.. 40 రోజుల్లో ఫినిష్

గతంలో ఎన్టీఆర్.. కృష్ణ లాంటి హీరోలు మెగా ఫోన్ పట్టి సినిమాలు తీశారు కానీ.. ఈ తరంలో హీరోలు దర్శకులుగా మారడం అరుదైపోయింది. ఐతే పూర్తి స్థాయి హీరోలు కాకపోయినా.. నటులుగా తామేంటో రుజువు చేసుకున్న కుర్రాళ్లు కొందరు మెగా ఫోన్ పడుతున్నారు. ఆ కోవలో ఇప్పటికే అవసరాల శ్రీనివాస్ మంచి పేరు సంపాదించాడు. ఇప్పుడు ‘అందాల రాక్షసి’.. ‘అలా ఎలా’ సినిమాలతో పేరు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ సైతం దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. అతను దర్శకుడిగా మారుతూ సుశాంత్ హీరోగా ‘చి ల సౌ’ అనే సినిమా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

నిన్నో మొన్నో షూటింగ్ మొదలైనట్లుగా ఉన్న ఈ సినిమా అప్పుడూ పూర్తయిందట. శనివారమే షూటింగ్ చివరి రోజు అని ప్రకటించి పెద్ద షాకిచ్చాడు రాహుల్. ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లిందే నవంబరు 6న. అంటే కేవలం 40 రోజుల్లో షూటింగ్ అవగొట్టేశాడన్నమాట రాహుల్. దర్శకుడిగా తొలి సినిమాకే అంత వేగం అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి అంత స్పష్టతతో సినిమా తీశాడనుకోవాలా.. లేదా ఏదో అలా చుట్టేశాడని భావించాలా..?

ఈ చిత్రంలో రుహాని అనే కొత్తమ్మాయి కథానాయికగా నటించింది. అను హాసన్.. సంజయ్ స్వరూప్.. వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కొత్త నిర్మాతలు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి దర్శకుడిగా రాహుల్ సినిమా ఎలా తీశాడో.. ఇదైనా సుశాంత్‌కు తొలి విజయాన్నందిస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English