నాగ్.. డిసెంబరు సీక్రెట్ చెప్పాడు

నాగ్.. డిసెంబరు సీక్రెట్ చెప్పాడు

అక్కినేని ఫ్యామిలీ డిసెంబరు సెంటిమెంటు గురించి అందరికీ తెలిసిందే. మన్మథుడు.. మాస్.. ఇంకా చాలా సినిమాలు డిసెంబర్లోనే విడుదలయ్యాయి. ఇప్పుడు నాగ్ చిన్న కొడుకు అఖిల్ హీరోగా నటించిన ‘హలో’ కూడా డిసెంబరులోనే రిలీజ్ కాబోతోంది. నాగ్ తీరు చూస్తే ఆయనకు ఇలాంటి సెంటిమెంట్లు ఉన్నట్లు కనిపించవు కానీ.. ఈ ఒక్క విషయంలో ఆయన కూడా సెంటిమెంటుకు దాసుడే అని స్పష్టంగా తెలుస్తోంది. ఓ ఇంటర్వ్యూలో నాగార్జున దగ్గర ఈ విషయమే ప్రస్తావిస్తే దానిపై స్పందించాడు.

2003 సంక్రాంతికి చాలా సినిమాలు రేసులో ఉండటంతో అనుకోకుండా ‘మన్మథుడు’ సినిమాను ముందు ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేశామని.. ఆ సినిమా సూపర్ హిట్టయిందని.. తర్వాత ‘మాస్’ కూడా అనుకోకుండానే డిసెంబర్లో రిలీజ్ చేస్తే అదీ బాగా ఆడిందని.. ఆ తర్వాత ‘సత్యం’ సినిమా కూడా డిసెంబర్లో రిలీజై విజయం సాధించిందని నాగ్ చెప్పాడు.

ఐతే ఒకసారి తన తండ్రి అభిమాని ఒకరు తనకు ఒక గ్రీటింగ్ పంపారని.. అందులో ఏఎన్నార్ పూర్తి స్థాయి హీరోగా నటించిన తొలి సినిమా కూడా 1944లో డిసెంబరు నెలలోనే రిలీజైనట్లు పేర్కొన్నారని.. అప్పట్నుంచి డిసెంబరు ఒక రకంగా తమకు సెంటిమెంటుగా మారిందని నాగ్ చెప్పాడు.

అఖిల్ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయడానికి సెంటిమెంటు ఒక కారణమైతే.. సంక్రాంతికి పవన్ కళ్యాణ్. బాలకృష్ణ లాంటి పెద్ద హీరోలతో అతను పోటీ పడితే బాగోదన్న ఉద్దేశంతో.. క్రిస్మస్‌కు నాలుగు రోజులు సెలవులుండటం చూసుకుని డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నట్లు నాగ్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English