తెలుగులో డిజాస్టర్.. తమిళంలో అయినా?

తెలుగులో డిజాస్టర్.. తమిళంలో అయినా?

అక్కినేని నాగార్జున-రాఘవేంద్రరావు కలయికలో గతంలో చాలా సినిమాలే వచ్చినా.. వాళ్ల కాంబినేషన్‌కు ఎనలేని గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం ‘అన్నమయ్య’నే. దీని తర్వాత ‘శ్రీరామదాసు’ కూడా మంచి ఫలితాన్నే అందుకుంది. ఐతే ‘శిరిడి సాయి’ మాత్రం నిరాశపరిచింది. ఐతే భగవంతుడు-భక్తుడు అనే కాన్సెప్ట్ అయితే తమ ఇద్దరికీ బాగా కలిసొస్తుంది.. ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా చేయడానికి సిద్ధపడ్డారిద్దరూ. ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. దీనికి మంచి రివ్యూలు కూడా వచ్చాయి. కానీ ఏం లాభం..? సినిమా ఆదరణకు నోచుకోలేదు. నాగార్జున కెరీర్లోనే పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందీ చిత్రం. రూ.40 కోట్లకు సినిమా అమ్మితే.. వెనక్కొచ్చింది రూ.10 కోట్లే.

ఈ దెబ్బతో రాఘవేంద్రరావు ఇంకో సినిమానే వద్దన్న వైరాగ్యంలోకి వెళ్లిపోయారు. నాగార్జున కూడా మళ్లీ భక్తి రస చిత్రమే చేయొద్దన్న నిర్ణయానికి వచ్చాడు. తెలుగులో అలాంటి ఫలితాన్నిందించిన ‘ఓం నమో వేంకటేశాయ’ ఇప్పుడు తమిళంలోకి వెళ్తోంది. ‘బ్రహ్మాండ నాయకం’ పేరుతో డిసెంబరు 29న ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయబోతున్నారు. ఇంతకుముందు నాగ్-రాఘవేంద్రరావుల ‘అన్నమయ్య’ సినిమాతో తమిళంలోకి అనువాదమై పెద్ద విజయమే సాధించింది. వేంకటేశ్వర స్వామి అంటే తమిళులకూ బాగా సెంటిమెంటు. ఈ నేపథ్యంలో ‘ఓం నమో వేంకటేశాయ’ తమిళంలో అయినా మంచి ఫలితాన్నందుకుంటుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు