వీరగ్రంథం సంగతి తేలలేదు.. ‘శశిలలిత’ట

వీరగ్రంథం సంగతి తేలలేదు.. ‘శశిలలిత’ట

నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ జీవిత కథ మీద సినిమా కోసం సన్నాహాల్లో ఉండగానే రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా అనౌన్స్ చేశాడు. ఐతే జనాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న అంశం మీదే సినిమా ప్రకటించి పబ్లిసిటీ కోసం హడావుడి చేయడం వర్మకు అలవాటే కాబట్టే ఆ సినిమా విషయంలో ఎవరికీ అంత ఆశ్చర్యం కలగలేదు. ఐతే వర్మ స్టయిల్లోనే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పబ్లిసిటీ పొందడం కోసం ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అంటూ సినిమా ప్రకటించి వార్తల్లో నిలిచాడు. ఈ సినిమా విషయంలో ఆయన మొదట్నుంచి వ్యహరిస్తున్న తీరు జనాలకు చిరాకు తెప్పిస్తోంది.
ఇంతకుముందు ఈ కేతిరెడ్డి తీసినవన్నీ బి-గ్రేడ్ సినిమాలే. ఇప్పుడు ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ విషయంలోనూ హడావుడే తప్ప సినిమా ముందుకు కదులుతున్న దాఖలాలేమీ కనిపించడం లేదు. ముందుగా ఎన్టీఆర్ ఘాట్‌లో.. ఆ తర్వాత ఎన్టీఆర్ పుట్టిన ఊరులో పబ్లిసిటీ గిమ్మిక్కులేవో చేశాడు తప్ప షూటింగ్ చేయలేదు. ‘విశ్వరూపం’ భామ పూజా కుమార్ లక్ష్మీపార్వతి పాత్ర చేస్తుందన్నాడు కానీ.. ఆమె వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈ సినిమా సంగతి ఎటూ తేలకుండానే కేతిరెడ్డి ఇప్పుడు మరో సినిమా అనౌన్స్ చేశాడు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. ఆమె స్నేహితురాలు శశికళల జీవితాల ఆధారంగా ఆయన ‘శశిలలిత’ అనే సినిమా తీయబోతున్నాడట. జయలలిత మరణానికి సంబంధించి అసలేం జరిగిందో ఈయన తన సినిమాలో చూపిస్తాడట.

తాను ఈ సినిమా గురించి చెన్నైలో ప్రకటించగానే మన్నార్ గుడి మాఫియా నుంచి బెదిరింపులు వచ్చాయని.. ఐతే చెన్నైలో తెలుగు భాష కోసం తాను పోరాడినపుడు బెదిరింపులు వస్తేనే తాను తగ్గలేదని.. ఈ సినిమా విషయంలో తగ్గుతానా అని అన్నాడు కేతిరెడ్డి. ఐతే ఈ సినిమా అనౌన్స్ చేయడం కూడా పబ్లిసిటీ కోసమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముందు ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సంగతేదో తేల్చి.. ఆ తర్వాత ఈ ‘శశిలలిత’ గురించి ఆలోచిస్తే మంచిదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు