యాంకర్ రవి పరిస్థితి ఏంటో?

యాంకర్ రవి పరిస్థితి ఏంటో?

బుల్లితెరపై యాంకర్ గా బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న చాలామంది.. ఆ తర్వాత హీరోగా మారేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తుంటారు. ఇలా ట్రయల్స్ వేరే వాళ్లు చాలామంది ఉంటారు కానీ.. వారిలో హీరోలు కుదురుకోగలగేవారు అరుదు. అలా హీరోగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు యాంకర్ రవి.

ఇదీ మా ప్రేమకథ అంటూ లవ్ స్టోరీ చేశాడు రవి. సీరియల్ నటి మేఘనా ఆకాష్ హీరోయిన్ గా నటించగా.. నిన్ననే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. స్టోరీ.. నెరేషన్ స్లోగా ఉన్నాయనే టాక్ తెచ్చుకుంది. రొటీన్ సినిమా అనే మాట కూడా వినిపిస్తోంది. అయితే.. కథ స్లోగా చెప్పినా మళ్లీరావా మూవీ చిత్రం విజయం సాధించింది. కానీ ఇది మా ప్రేమకథ విషయంలో అలా జరగడం లేదు. గత నెలన్నరగా చిన్న సినిమాల జాతర జరుగుతుండగా.. అందులో ఇది కూడా కొట్టుకుపోయే పరిస్థితే కనిపిస్తోంది.

నిజానికి టీజర్ రిలీజ్ నుంచి ఈ సినిమాకు అంతగా క్రేజ్ ఏర్పడలేదు. ఇప్పుడు అదే ఎఫెక్ట్ సినిమా కూడా కనిపిస్తోంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని.. ఆస్తులు తాకట్టు కూడా పెట్టి మరీ ప్యాషన్ తో సినిమా చేశామని ఓ సందర్భంలో అన్నాడు రవి. మరి ఇప్పుడు రిలీజ్ అయిపోయింది.. రిజల్ట్ సంగతి దాదాపుగా తేలిపోయింది.. రవి తన ట్రయల్స్ ఇంకా కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు