పాపకు కోటింగ్ లేని పాత్రలు కావాలట

పాపకు కోటింగ్ లేని పాత్రలు కావాలట

కెమేరా ముందు కనిపించడం అంటే.. ఎవరైనా సరే బోలెడంత మేకప్ వేసుకోవాల్సిందే. ప్రతీ సన్నివేశంలోనూ దట్టంగా కోటింగ్ కొట్టాల్సిందే. ఈ విషయంలో హీరోయిన్స్ పరిస్థితి మరీ దారుణం. ఏ కాస్త మేకప్ తగ్గినా.. అందం కరిగిపోయిందని హంగామా మొదలైపోతుంది.

బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ స్కిన్ షోకి పెట్టింది పేరు. బికినీ బేబ్ గా తనకు తానే బిరుదు కూడా ఇచ్చేసుకోగల తెగువ ఈమె సొంతం. అయితే.. ఈ హాట్ పాపకు మేకప్ పై కాసింత విరక్తి కలిగినట్లుగా ఉంది. ఏళ్ల తరబడి ఇలా మేకప్ వేసుకుని చాలానే విసుగొచ్చేసిందట. ఈ విషయాన్ని ఓ స్కిన్ కేర్ అప్లికేషన్ లాంఛ్ చేస్తూ చెప్పడం విశేషం. ఆ అప్లికేషన్ తనకు బాగా ఉపయోగపడుతోందని  చెప్పిన అమీ.. ఫేస్ మేకప్ కోసం ఉపయోగించే క్రీమ్స్ లో ఉండే కెమికల్స్ గురించి రీసెంట్ గానే తెలుసుకుందట. అందుకే ఇప్పుడు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నట్లు చెప్పింది అమీ జాక్సన్.

ఇక సినిమాల్లో కూడా దట్టంగా మేకప్ వేసుకుని చేసే రోల్స్ పై మొహం మొత్తేసిందని చెప్పిన ఈ భామ.. వీలైనంత తక్కువగా మేకప్ వేసుకుని నటించే పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతోంది. డీ గ్లామర్ రోల్స్ చేయాలని ఉందని చెప్పలేదు కానీ.. దాదాపు అలాగే మాట్లాడింది ఈ బ్రిటన్ అందం. అల్ట్రామోడర్న్ గ్లామర్ ను పంచే ఈ భామకు డీ-గ్లామర్ రోల్స్ ఆఫర్ చేసే ధైర్యం ఎవరు చేస్తారో మరి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English