పవన్‌కళ్యాణ్‌కి భయపడని రవితేజ

పవన్‌కళ్యాణ్‌కి భయపడని రవితేజ

సంక్రాంతికి అజ్ఞాతవాసి, జై సింహాతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా విడుదల కాబోతున్నాయి. సూర్య గ్యాంగ్‌, విశాల్‌ అభిమన్యుడు ఆల్రెడీ అనౌన్స్‌ కాగా, రవితేజ నటించిన 'టచ్‌ చేసి చూడు' కూడా సంక్రాంతి స్లాట్‌ బుక్‌ చేసుకున్నట్టు సమాచారం. సంక్రాంతికి రవితేజకి మంచి ట్రాక్‌ రికార్డ్‌ వుంది. కృష్ణ, మిరపకాయ్‌ లాంటి విజయాలు అతనికి దక్కాయి. దీంతో సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తే బాగుంటుందని రవితేజ భావిస్తున్నాడట. పవన్‌ సినిమా పోటీకి వుందన్నా కానీ మంచి సీజన్‌ కనుక భయపడాల్సిన పని లేదని అంటున్నాడట.

రాజా ది గ్రేట్‌ చిత్రానికి వసూళ్లు బాగానే రావడంతో, సంక్రాంతికి పోటీ వున్నా కానీ తన సినిమాకి వుండే ఆడియన్స్‌ వుంటారనేది అతని నమ్మకమట. గతంలో బాలకృష్ణ చిత్రాలకి పోటీగా తన చిత్రాలు వచ్చినపుడు సక్సెస్‌ అయ్యాయి. అది కూడా రవితేజ మైండ్‌లో వుండి వుండొచ్చు.

అయితే అన్ని సినిమాల మధ్య థియేటర్ల కొరత రావడం గ్యారెంటీ. టచ్‌ చేసి చూడు చిత్రాన్ని సరిగ్గా భోగి రోజున విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్లు సంక్రాంతికి రిలీజ్‌ అంటే ఒప్పుకుంటారా లేదా అనేది తేలాలి. అజ్ఞాతవాసి టీజర్‌, ఆడియో వచ్చిన తర్వాత సంక్రాంతికి వచ్చే సినిమాల మీద ఫుల్‌ క్లారిటీ వచ్చేస్తుందంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు