‘కడప’ ట్రైలర్లో ఆ షాట్ ఏదైతే ఉందో..

 ‘కడప’ ట్రైలర్లో ఆ షాట్ ఏదైతే ఉందో..

రామ్ గోపాల్ వర్మ కొన్ని నెలల కిందట ‘గన్స్ అండ్ థైస్’ అనే వెబ్ సిరీస్ ట్రైలర్ వదిలాడు గుర్తుందా..? అందులో కొన్ని షాట్‌లు సెన్సేషనల్ అయ్యాయి. సినిమాల్లో చూపించడానికి వీల్లేని బోల్డ్ సీన్లను, మాటల్ని స్వేచ్ఛగా వాడేసి ‘రా’ సినిమాల్ని ఇష్టపడే వాళ్లను ఉర్రూతలూగించాడు వర్మ. ఇప్పుడు ఆయన లాంచ్ చేసిన ‘కడప’ ట్రైలర్ కూడా ఇదే తరహాలో ఉంది. ఈ ట్రైలర్ చూస్తే షాకవడం ఖాయం. కడప జిల్లాలోని పల్లెటూళ్లలోని ఫ్యాక్షన్ గాథల్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశాడు వర్మ. ఇందులోని కొన్ని షాట్లు ప్రకంపనలు రేపేలా ఉన్నాయి.

ట్రైలర్ మొత్తంలో స్టాండ్ ఔట్ గా నిలిచే ఒక షాట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రోడ్డు మీద పిల్లలు తమాషాగా టైర్ ఆట ఆడుకుంటూ ముందుకొస్తుంటే.. వాళ్ల మీది నుంచి కెమెరాను తీసుకొచ్చి పోలీస్ జీపుకి కట్టి లాక్కెళ్తున్న పోలీస్ శవం కనిపిస్తుంది. ఫ్యాక్షన్ గ్రామాల్లో పోలీసులు అడుగుపెట్టి అతి చేస్తే ఫ్యాక్షనిస్టులు వారికి ఎలాంటి గతి పట్టిస్తారో చూపించడానికి వర్మ ఈ సీన్ తీసినట్లున్నాడు. ఈ షాట్‌లో రామ్ గోపాల్ వర్మ ముద్ర స్పష్టంగా కనిపించింది. ఇక ఈ ట్రైలర్లో ఒళ్లు గగుర్పొడిచే.. షాకింగ్‌గా అనిపించే మరెన్నో సన్నివేశాలున్నాయి.

పిల్లాడు ఏడుస్తుంటే.. ఇద్దరు మేడ మీద పట్టపగలు శృంగారంలో పాల్గొంటుంటారు.. ఒక వ్యక్తి కాలిని ఒకరు గొడ్డలితో నరికితే, మరొకరు నరికిన కాలిని తీసి అవతల పడేస్తారు.. ఒక లేడీ ఆడదంటే ‘----’కే పనికొస్తుందనుకున్నావారా అంటూ ఓ పచ్చి బూతు మాట పలికి ఒకడిని శృంగారం మధ్యలో పొడిచి చంపేస్తుంది.. ఇలా ట్రైలర్లో చాలా బోల్డ్‌గా, వయొలెంట్‌గా అనిపించే చాలా సీన్స్ ఉన్నాయి. వెబ్ సిరీస్ అంటే సెన్సార్ సమస్యలు ఉండవు కాబట్టి వర్మ పూర్తి స్వేచ్ఛ తీసుకుని చెలరేగిపోయినట్లున్నాడు. ఐతే కడప ఫ్యాక్షనిజాన్ని మరీ గ్లోరిఫై చేసినట్లు ఉన్న నేపథ్యంలో దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతాయేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు